టీడీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక చేశారు. కట్టుతప్పితే కట్డడి చేయాల్సిఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ అధిష్టానం చెప్పిందే శాసనమని స్పష్టం చేశారు. కాదు-కూడదని అంటే.. చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎవరిని కేటాయిస్తే.. వారే పోటీలో ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. లేకపోతే.. సీరియస్ యాక్షన్ ఉంటుందన్నా రు.
మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేనలు సీట్లు పంచుకున్నాయి. జనసేనకు 4 కార్పొరేషన్లు, 21 మునిసిపల్ చైర్మన్ పోస్టులను కేటాయించారు. ఇక, బీజేపీకి 2 కార్పొరేషన్లు.. 12 మునిసిపల్ చైర్మన్ పోస్టులు ఇచ్చారు. అయితే.. తమ ప్రాబల్యం ఎక్కువగా ఉందని.. ఆది నుంచి ఆయా ప్రాంతాల్లో పాగా వేశామని చెబుతున్న టీడీపీ నాయకులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయా స్థానాల్లో నామినేషన్లు వేసేశారు. వారే కాదు.. వారి కుటుంబ సభ్యులతోనూ వేయించారు.
ఉదాహరణకు ఏలూరు కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయిస్తే.. ఇక్కడ టీడీపీ కూడా నామినేషన్ వేసింది. విజయవా డలోనూ ఇలానే జరిగింది. సాలూరు మునిసిపాలిటీలో కూడా ఇలానే నామినేషన్ వేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా బరిలో నిలిస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం చెప్పిందే ఫైనల్ అని.. అన్నీ ఆలోచించి, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని, ఐవీఆర్ ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలు విన్నాకే అభ్యర్థులను నిర్ణయించినట్టు చంద్రబాబు తేల్చి చెప్పారు.
దసరా అయినప్పటికీ.. సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో ఆయన ఫోన్లోనే మాట్లాడారు. అనంతరం.. వారి అభిప్రాయాల మేరకు టీడీపీ నేతలతో కూడా టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి.. రెబల్స్‌గా నామినేషన్‌వేసిన వారు వెనక్కి తగ్గకపోతే.. చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. వచ్చే 2029లోనూ పార్టీ కూటమిగానే అధికారంలోకి వస్తుందని .. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు.