సీఈసీ రాజీనామా చేస్తారా?

admin
Published by Admin — September 25, 2026 in
News Image
నూహ్య రీతిలో తెర మీద‌కు వ‌చ్చిన భార‌త ఎన్నిక‌ల ప్ర‌ధాన సంఘంలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త విభేదాల వేళ‌.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ తాజాగా మీడియా భేటీని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ 48 గంట‌ల వ్య‌వ‌ధిలో త‌న సీఈసీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని అల్టిమేటంజారీ చేశారు. ఒక‌వేళ తాము చెప్పిన‌ట్లుగా గ‌డువు లోపు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌మ‌కుంటే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. జంత‌ర్ మంత‌ర్ 2.0 ఉద్య‌మాన్ని మొద‌లు పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఇంత‌కూ భార‌త ఎన్నిక‌ల సంఘంలో ఏమేం చోటు చేసుకున్నాయి? అస‌లీ వివాదంలోకి వెళితే.. బోలెడ‌న్ని విష‌యాలు వ‌స్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వ‌రూపానికి వ‌స్తే.. సీఈసీ (ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్)తో పాటు ఇద్ద‌రు ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు ఉన్నారు. అయితే.. ఓట‌ర్ల జాబితా నిర్వ‌హ‌ణ‌పై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు ప‌దే ప‌దే లిఖిత‌పూర్వ‌కంగా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు.. సీఈసీ హోదాలో ఉన్న ఆయ‌న ప‌లు కీల‌క నిర్ణ‌యాల్ని ఏక‌ప‌క్షంగా తీసుకున్నార‌న్న‌ది మ‌రో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అన్నింటికి మించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ.. సింపుల్ గా చెప్పాలంటే స‌ర్ ప్ర‌క్రియ‌లోనూ సీఈసీ అధికార బీజేపీకి మేలు క‌లిగేలా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది మ‌రో ఆరోప‌ణ‌.
 
ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌నితీరుపై కొత్త సందేహాలు తెర మీద‌కు వ‌చ్చిన వేళ‌.. విప‌క్ష కాంగ్రెస్ తో పాటు.. ప‌లు ఇత‌ర పార్టీలు సీఈసీ తొల‌గింపుపై డిమాండ్ కు తెర తీశాయి. అయితే.. ఎన్నిక‌ల సంఘం మాత్రం త‌మ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని.. అవ‌న్నీ త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా చెప్పుకున్నారు.తాము తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ ఏక‌గ్రీవంగా.. చ‌ట్ట‌బ‌ద్దంగా సాగిన‌ట్లుగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు రంగంలోకి వ‌చ్చారు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ. తాజాగా వారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. సంచ‌ల‌న డిమాండ్లు చేశారు.
 
దేశంలోని ప్ర‌జాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాక్రోచ్ పార్టీ పేర్కొంది. త‌క్ష‌ణం ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆయ‌న‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు ప్రారంభించాల‌న్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఊడిగం చేయాల‌న్న‌దే జ్ఞానేష్ కుమార్ ఆలోచ‌న అయితే.. త‌న చేతిలో ఉన్న రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం వివాదాస్ప‌దంగా మారిన కొత్త ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ను నిలిపివేయాల‌న్నారు. అంతేకాదు.. రాబోయే కొద్ది నెల‌ల్లో జరిగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టాల‌న్నారు. అంతేకాదు.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి సంబంధించి 2023లో కొత్త చ‌ట్టాన్ని పూర్తిగా ర‌ద్దు చేయాల‌న్న‌ది మ‌రో డిమాండ్.
 
జులైలో ప‌రీక్ష‌ల లీకేజీ అంశాన్ని టేక‌ప్ చేసి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వ‌ర‌కు ఊరుకోలేదు. మొదట్లో వీరి నిర‌స‌న‌ను మోడీ స‌ర్కారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కేవ‌లం నాలుగు రోజుల హ‌డావుడి కార్య‌క్ర‌మంగా భావించారు. వీరి అంచ‌నాల‌కు భిన్నంగా ఉద్య‌మం దేశ వ్యాప్తంగా.. అందునా యూత్ స్పందించ‌టంతో చూస్తుండ‌గానే.. ఈ ఉద్య‌మం పెరిగి.. భారీగా పెద్ద‌దైంది. చివ‌ర‌కు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కేంద్ర‌మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఇది ఇలా ఉండ‌గా.. తాజాగా కాక్రోచ్ పార్టీ టేక‌ప్ చేసిన ఈ వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళుతుందో చూడాలి.
Tags
cec gyanesh kumar resignation cjp bjp
Recent Comments
Leave a Comment

Related News

Latest News