జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు మరో నామినేటెడ్ పదవి దక్కింది. పర్యావరణ పరిపుష్టి కోసం ఆంధ్రప్రదేశ్ హరిత మరియు అటవీ పునరుద్ధరణ సంస్థ (AP-GREEN) చైర్మన్‌గా ఆయనను నియ మిస్తూ.. ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ రాష్ట్ర అటవీ శాఖకు అనుబంధంగా పనిచేయ నుంది. రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జిల్లాల స్థాయిలోనూ AP-GREEN ఏర్పాటు చేయనున్నారు. వాటికి కూడా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రస్థాయి కమిటీకి నాగబాబును చైర్మన్‌గా నియమించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచడంతో పాటు అటవీ పరిరక్షణకు ఈ సంస్థ కృషి చేయనుంది. అలానే అటవీ పెంపకాలను కూడా చేపట్టనుంది. అదేవి ధంగా పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తుంది. పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉండే ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించనుంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించనుంది.
పవన్ ఆశయానికి అనుగుణంగా..
రాష్ట్రంలో హరిత వనాలను అభివృద్ధి చేయడం.. అటవీ సంపదను వృద్ధిచేయడం.. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు చొచ్చుకు రాకుండా చూడడం వంటి కీలకలక్ష్యాలు పెట్టుకున్న అటవీ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఏపీ గ్రీన్ సంస్థ పనిచేయనుంది. ముఖ్యంగా పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. జల సంరక్షణ చర్యలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనుంది. ఇక, జిల్లా స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇవి రాష్ట్రస్థాయి కమిటీకి అనుబంధంగా పనిచేయనున్నాయి.