రూ. 2 కోట్ల అడ్వాన్స్.. బుచ్చిబాబు మూడో సినిమా ఎవ‌రితో..?

admin
Published by Admin — August 09, 2026 in Movies
News Image

టాలీవుడ్‌(Tollywood)లో డెబ్యూతోనే సంచలనం సృష్టించిన డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు సాన పేరు ముందుంటుంది. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్, తన రెండో ప్రాజెక్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంపై అప్పట్లో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోవడంతో, ట్రేడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల చర్చలు నడిచాయి. ఈ రిజల్ట్ బుచ్చిబాబు కెరీర్‌పై చిన్నపాటి ప్రభావం చూపినప్పటికీ, ఆయనకున్న టాలెంట్ పై ఇండస్ట్రీకి ఎప్పుడూ నమ్మకం ఉంది.

ఈ తరుణంలో బుచ్చిబా తన తదుపరి చిత్రం గురించిన ప్రణాళికలను వేగంగా రచిస్తున్నారు. ‘ఉప్పెన’ తర్వాత గ్యాప్ తీసుకున్నట్లుగా ఈసారి ఆలస్యం చేయకూడదని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం తన మూడో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను ఆయన శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్(Ram Charan) లాంటి స్టార్‌తో సినిమా చేసిన అనుభవం ఉండటంతో, ఈసార కథను మరింత పకడ్బందీగా, విభిన్న జోనర్‌లో తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లుగా జరిగితే, ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా ఓ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ బుచ్చిబాబు(Buchi Babu)కు ఏకంగా రూ. 2 కోట్ల భారీ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అడ్వాన్స్ ఇచ్చింది ఏ ప్రొడక్షన్ హౌస్ అయి ఉంటుంది? మూడో సినిమా అదే బ్యానర్‌లో ఉంటుందా? లేక వేరే కాంబినేషన్ సెట్ అవుతుందా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ఈసారి బుచ్చిబాబు తన మూడో సినిమాతో ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఆయన ఎవరితో జతకట్టబోతున్నారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Tags
Buchi Babu Sana Tollywood Peddi Telugu Cinema Ram Charan
Recent Comments
Leave a Comment

Related News

Latest News