పార్లమెంట్‌లో హైలెట్‌గా కంగనా గొడుగు.. ధ‌ర తెలిస్తే షాక్‌.!

admin
Published by Admin — August 09, 2026 in Politics, Movies
News Image

సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే చాలు.. రాజకీయ నాయకుల హాట్‌ హాట్‌ చర్చలు, మాటల యుద్ధాలే వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే, హౌస్‌ బయట మాత్రం మన సెలబ్రిటీ పొలిటిషియన్ల ఫ్యాషన్ ట్రెండ్స్, స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) పార్లమెంట్‌కు వచ్చిన తీరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వర్షాకాల సమావేశాలకు హాజరైన కంగనా.. ఎప్పటిలాగే తనదైన శైలిలో ట్రెడిషనల్ చీరకట్టులో ఎంట్రీ ఇచ్చి అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు. అయితే ఆమె ధరించిన ఖరీదైన చీరల కంటే, చేతిలో పట్టుకున్న ఒక చిన్న వస్తువే ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే ఆమె చేతిలోని కలర్‌ఫుల్ అంబ్రెల్లా(Umbrella)!

వర్షం నుంచి తడవకుండా ఉండటానికి మనం వాడే సాధారణ నలుపు రంగు గొడుగులకు ఆమె గొడుగుకు చాలా వ్యత్యాసం ఉంది. ఆక్వా బ్లూ కలర్‌లో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ గొడుగు.. కంగనా(Kangana) ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ వర్షకాలంలో కేవలం ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాకుండా, దాన్ని కూడా ఒక స్టైల్ యాక్సెసరీగా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అయితే, ఆ గొడుగు తాలూకు స్పెషాలిటీ చూసి మురిసిపోయిన నెటిజన్లకు, దాని అసలు ధర తెలిశాక మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎందుకంటే ప్రముఖ లగ్జరీ డిజైన్ బ్రాండ్ 'గుడ్‌ ఎర్త్‌' (Good Earth) సంస్థకు చెందిన ఈ ప్రత్యేకమైన గొడుగు ధర అక్షరాల రూ.6,100. కేవలం ఒక గొడుగు కోసం ఆరు వేల పైచిలుకు ఖర్చు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. ఏదేమైనా.. రాజకీయాల్లో ఉన్నా తనదైన ఫ్యాషన్‌ గ్లామర్‌తో కంగనా ఎప్పుడూ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags
Kangana Ranaut Kangana Umbrella Bollywood Parliament Session Viral News BJP
Recent Comments
Leave a Comment

Related News