రిజర్వేషన్లు తొలగించడం సాధ్యమేనా?

admin
Published by Admin — July 29, 2026 in Politics
News Image
కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) పేరుతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన బొద్దింక‌ల పార్టీ.. యువ‌త‌ను ఏకం చేసింది. నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంపై కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. నిర‌స‌న‌ల‌తో ప్రారంభ‌మైన కాక్రోచ్ పార్టీ ఉద్య‌మం... కేంద్ర మంత్రి రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టుబ‌ట్టింది. సాధించింది. ఇప్పుడు ఈ ప‌రంప‌ర‌లో.. ఆర్ హెచ్ ఏ అనే మ‌రో ఉద్య‌మ పార్టీ పురుడు పోసుకుంది. రిజ‌ర్వేష‌న్ హ‌ఠావో ఆందోళ‌న్‌(ఆర్ హెచ్ ఏ) పేరుతో ఏర్పాటైన ఈ ఉద్య‌మ పార్టీ దేశ‌వ్యాప్తంగా రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించ‌నుంది.
 
ప్రారంభంలోనే ఆర్ హెచ్ ఏకు ఏకంగా 55 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు జ‌మ‌య్యారు. ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఆర్ హెచ్ ఏ వెనుక ఎవ‌రున్నారు? ఎవ‌రు దీనిని లీడ్ చేస్తున్నారు? అనే విష‌యాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ప్రొఫైల్ లో మాత్రం రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ సూక్తుల‌ను పేర్కొన్నారు. అలానే రిజ‌ర్వేష‌న్ కార‌ణంగా దేశంలో యువ‌త‌కు జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రించారు. మొత్తంగా ఇన్ స్టాలో 100కు పైగా పోస్టులు పెట్టారు. వీటిని 55 ల‌క్ష‌ల మందికి పైగా ఫాలోయ‌ర్లు లైక్ చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో కాక్రోచ్ పార్టీకి కూడా ఇలానే ల‌క్ష‌ల సంఖ్య‌లో ఫాలోయ‌ర్లు ఉన్నారు.
 
ఆర్ హెచ్ ఏ తాజాగా కొన్ని ప్ర‌ణాళిక‌ల‌ను కూడా ప్ర‌క‌టించింది. కుల ఆధారిత రిజ‌ర్వేష‌న్ల‌ను సంపూర్ణంగా ఎత్తేయాల‌ని పేర్కొంది. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో మాత్ర‌మే వెనుక‌బ‌డిన కులాల‌కు న్యాయం చేయాల‌ని పేర్కొంది. ముఖ్యంగా విద్య‌, ఉద్యోగాల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయ‌రాద‌ని.. స్ప‌ష్టం చేసింది. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌తిభ ఉన్న యువ‌త వెనుక‌బ‌డిపోతున్నార‌ని.. నాణ్య‌మైన విద్య కూడా అంద‌డం లేద‌ని ఆర్ హెచ్ ఏ త‌న ప్ర‌ణాళిక‌లో వివ‌రించింది. దైనందిన ప్ర‌జా జీవితంలో కులం, కుల ఆధారిత వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది.
 
దేశ‌వ్యాప్తంగా..
 
ఆర్ హెచ్ ఏ త‌న ఉద్య‌మాన్ని దేశ‌వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ప్ర‌స్తుతం ఇన్ స్టాలో మాత్ర‌మే ప్రారంభ‌మైన ఈ ఉద్య‌మం.. త్వ‌ర‌లోనే ఇత‌ర వేదిక‌ల‌పైనా విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపింది. త‌మ వెనుక ఏ రాజ‌కీయ శ‌క్తికానీ.. పార్టీ కానీ, నాయ‌కుడు కానీ లేర‌ని స్ప‌ష్టం చేసింది. కేవలం ప్ర‌జ‌లు మాత్ర‌మే త‌మ వెంట ఉన్నార‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా వినిపించే ప్ర‌తి గ‌ళం త‌మ‌తో క‌లిసి రావాల‌ని కోరింది. స‌మాజంలో మార్పు కోసం.. దేశ ఉన్న‌తి కోస‌మే ఆర్ హెచ్ ఏ కృషి చేస్తుంద‌ని.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ త‌మ‌కు స్ఫూర్తి ప్ర‌దాత అని పేర్కొంది.
Tags
reservation hatao cjp possible?
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News