మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో.. రాం చరణ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. `న్యూ ఏజ్ మెగా స్టార్`(కొత్త తరం మెగాస్టార్) అంటూ.. పెద్దిని ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా.. రాంచరణ్ హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ప్రధాని మోడీ.. రాం చరణ్‌ను అభినందించారు. ఆయన మరింతగా పురోభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. సుమారు 5 నిమిషాలకుపైగానే రాం చరణ్‌తో ప్రధాని సంభాషించారు.
చిరు ఆనందం..
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి.. మురిసిపోయారు. పుత్రోత్సాహంతో తన హృద యం నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈవెంట్‌లో ప్రధానితో రాం చరణ్ కలిసి ఉన్న ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ``ఒక తండ్రిగా ఇంతకన్నా నాకు ఆనంద క్షణాలు ఏముం టాయి`` అని పేర్కొన్నారు. రాంచరణ్.. మరింతగా తెలుగు సినిమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
తన కృషి, పట్టుదల, నటనతో అశేష ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకున్న రాం చరణ్.. ఇప్పుడు జాతీ య వేదికలపై కూడా గుర్తింపు పొందుతుండడం సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఒక తండ్రి గా ఈ సందర్భాలు తనకు ఎంతో గర్వంగా ఉన్నాయని తెలిపారు. పుత్రుడు పుట్టగానే సంతోషించడం ఒక ఎత్తయితే.. ఆ పుత్రుడు సాధించిన ఘనతతో వచ్చే ఆనందం మరో ఎత్తు అంటూ వివరించే సుమతీ శతకంలోని పద్యాన్ని ఈ సందర్భంగా చిరు వివరించారు.
ముఖ్యంగా రాం చరణ్‌ను ప్రధాని అంతటి నాయకుడు.. `న్యూ ఏజ్ మెగాస్టార్` అని సంబోధించడం మరింత ఆనందం కలిగించిందని చిరంజీవి తెలిపారు. కాగా.. ఈ సమ్మిట్‌కు దేశవ్యాప్తంగా ప్రముఖ నటులు, క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వారితో ప్రధాన మంత్రి సంభాషించారు. రాబోయే యువతరం కీలకంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని కూడా వారికి చేరువ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.