విజయ్ పై ఆ నటి షాకింగ్ ఆరోపణలు

admin
Published by Admin — June 02, 2026 in National
News Image

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వరకు నడిచిన హై డ్రామా అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో విజయ్ పొలిటికల్ జర్నీ సాగింది. అయితే, సీఎం అయిన తర్వాత విజయ్ కు అసలు సిసలు రాజకీయాల సెగ తగలడం మొదలైంది. తన భార్యకు విడాకులు ఇచ్చిన విజయ్..త్రిషతో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం...ఈ రెండు విషయాలలో విజయ్ ను ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు.

అంతేకాదు, గతంలో విజయ్ కు సంబంధించిన పలు విషయాలను పలువురు తెరపైకి తెచ్చి రచ్చ చేస్తున్నారను. ఈ క్రమంలోనే విజయ్ పై తమిళ టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ షాకింగ్ ఆరోపణలు చేశారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ జూలీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి.

జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనపై టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు చేసిన ట్రోలింగ్, వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని ఆమె ఆరోపించారు. అందువల్లే తన కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరుగా విజయ్ కారణం కాకున్నా.... తన అభిమానులకు ట్రోలింగ్ ఆపాల్సిందిగా విజయ్ ఒక్క మాట చెప్పి ఉంటే తాను బిడ్డను కోల్పోయేదాన్ని కాదని జూలీ ఆరోపించారు. విజయ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడంతోపాటు మెరీనా బీచ్ వద్ద నిరసన తెలపడంతోనే తనను టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు టార్గెట్ గా చేసుకున్నారని జూలీ ఆరోపించారు. తనపై రూ. 15 లక్షల విలువైన నకిలీ కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

జూలీ చేసిన ఆరోపణలను టీవీకే నేతలు, కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఆన్‌లైన్ వేధింపులపై జూలీ ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి, ఈ వ్యవహారంపై సీఎం విజయ్, టీవీకే పార్టీ అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags
Cm vijay tv actress Julie shocking comments
Recent Comments
Leave a Comment

Related News