ముగిసిన మ‌హానాడు: 1875 క్లస్టర్లు... 12 దేశాలు... 24 లక్షల మంది!

admin
Published by Admin — May 29, 2026 in Politics, Andhra
News Image

ఆన్‌లైన్ అయినా.. ఆఫ్‌లైన్ అయినా తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) ఏటా నిర్వ‌హించే మ‌హానాడు వైభ‌వ‌మే వేరు. ఈ సారి ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక‌త్త‌ల‌తో ఇంధ‌న చార్జీలు పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి మోడీ పొదుపు మంత్రం ప‌ఠిస్తున్నారు. దీనిని అందిపుచ్చుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న నుంచే పొదుపు చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో మ‌హానాడును ఆన్‌లైన్ వేదిక‌గా నిర్వ‌హించారు. అంతేకా దు.. తొలుత మూడు రోజుల పాటు ఈ పండుగ చేయాల‌ని అనుకున్నా.. చివ‌ర‌కు రెండు రోజుల‌కే ప‌రిమి తం చేశారు.

ఇక‌, రెండు రోజులు నిర్వ‌హించిన మ‌హానాడులో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఐదు సార్లు ప్ర‌సంగించారు. పార్టీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్(Nara Lokesh) మూడు సార్లు త‌న వాణిని వినిపించారు. అదేస‌మ‌యంలో ఇత‌ర ముఖ్య నేత‌లు.. రెండు రోజులూ ప్ర‌సంగించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూనే.. మ‌రోవైపు కేంద్ర కార్యాల‌యం(మంగ‌ళ‌గిరి)లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో కూడా పార్టిసిపేట్ చేశారు. మొత్తంగా ఆన్‌లైన్‌లోనే మ‌హానాడు ను నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. హిట్ కొట్టారు.

+ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోని 1875 క్ట‌స్ల‌ర్ల‌లోనూ.. మ‌హానాడు(Mahanadu) నిర్వ‌హించారు. దీనిలో ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. నాయ‌కుల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌సంగించారు. ముఖ్యంగా కార్య‌క‌ర్త ల సెంట్రిక్‌గానే నిర్వ‌హించారు. కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను మైటీడీపీ యాపప్‌లో న‌మోదు చేశారు.

+ అలాగే.. అమెరికా(America), దుబాయ్‌, సింగ‌పూర్ స‌హా 12 దేశాల్లో కూడా మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌లు ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలు నిర్వ‌హించారు. ముఖ్య నాయ‌కుల‌తోపాటు.. ఆయా దేశాల్లోని కార్య‌క‌ర్త‌లు కూడా ఈ ప‌సుపు పండుగ‌లో పార్టిసిపేట్ చేశారు.

+ మ‌హానాడు(Mahanadu)లో మొత్తం 24 ల‌క్ష‌ల 50 వేల మంది కార్య‌క‌ర్త‌లు పార్టిసిపేట్ చేసిన‌ట్టు పార్టీ తెలిపింది. అంద రి నుంచి ఆన్‌లైన్‌లో హాజ‌రు తీసుకున్నారు. అలాగే.. ప్ర‌తి క్ల‌స్ట‌ర్‌లోనూ 50 వేల మందికి త‌గ్గ‌కుండా భోజ‌నాలు ఏర్పాటు చేశారు.

+ తీర్మ‌నాల విష‌యానికి వ‌స్తే.. అన్న‌గారు ఎన్టీఆర్‌(NTR)కు భార‌త ర‌త్న ఇవ్వాల‌న్న కీల‌క తీర్మానంతో పాటు.. మ‌హిళ‌ల‌కు పార్టీలో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. అలానే.. కార్య‌క‌ర్త‌లే-అధినేత‌లు అనే తీర్మానం స‌హా.. మొత్తంగా 20 తీర్మానాల‌ను మ‌హానాడు ఆమోదించింది.

+ ఎన్నిక‌లు ఏవైనా గెలుపు ముఖ్యం అనే నినాదం బ‌లంగా వినిపించారు. కూట‌మి పార్టీల నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండాల‌ని.. క‌ల‌సి ప‌నిచేస్తేనే విజ‌యం త‌థ్య‌మ‌ని చంద్ర‌బాబు(Chandrababu) ప‌దే పదే చెప్పుకొచ్చారు. మొత్తంగా రెండు రోజుల మ‌హానాడు పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ప‌క్కా ద‌శ‌-దిశ‌ను క‌ల్పించింద‌ని సీనియ‌ర్ నాయ‌కులు తెలిపారు.

Tags
TDP Hybrid Mahanadu Mahanadu 2026 Chandrababu Naidu Nara Lokesh TDP Mahanadu
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News