పవన్ కళ్యాణ్ కొత్త ఆర్మీ.. జ‌న‌సేన‌లో న‌యా జోష్‌!

admin
Published by Admin — May 20, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయన సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. కేవలం ఎన్నికల ముందే కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీ యంత్రాంగాన్ని పరుగులెత్తించేందుకు ఒక పవర్‌ఫుల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే జనసేనలో మునుపెన్నడూ లేని విధంగా మూడు సరికొత్త విభాగాలను రంగంలోకి దించుతున్నారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజాగా ప్రకటించిన ‘లక్ష్యదళ్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్’ అనే మూడు విభాగాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే నియోజకవర్గాల వారీగా సమన్వయం చేయడం.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో ప్రత్యేక బాధ్యతను అప్పగించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది జనసేనను మరింత ప్రొఫెషనల్‌గా, కేడర్ బేస్డ్ పార్టీగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన సరికొత్త పొలిటికల్ ఆర్మీ.

ఈ మూడు దళాల్లో 'లక్ష్యదళ్' పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పనిచేస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను నడిపిస్తూ, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతను 'నిర్వాహక దళ్' చూసుకుంటుంది. ఇక జనసేన(Janasena) అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ, పరిపాలనా విధులను 'పరిపాలక దళ్' పర్యవేక్షిస్తుంది. ఈ విభజన ద్వారా పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రతీ ఒక్కరికీ నిర్దిష్టమైన బాధ్యతలు లభిస్తాయి.

ఈ కొత్త దళాల ప్రకటనతో జనసేన కేడర్‌లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి క్రమశిక్షణ కలిగిన విభాగాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, పవన్ కళ్యాణ్ సుదూర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వచ్చే ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్‌గా ఈ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు శక్తులు గనుక క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయితే, ఏపీ(AP) పాలిటిక్స్‌లో జనసేన గ్రాఫ్ మరింత ఊహించని స్థాయికి చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
Pawan Kalyan Janasena AP Politics Deputy CM Pawan Kalyan Ap News Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News