కవిత పాంచజన్యం..వర్కవుటవుద్దా?

admin
Published by Admin — April 26, 2026 in Telangana
News Image
వ‌చ్చేది తెలంగాణ రాష్ట్ర సేన‌(టీఆర్ ఎస్‌)(trs) ప్ర‌భుత్వ‌మేన‌ని ఆ పార్టీ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత(kalvakuntla kavita) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం అమ్మ జేబు చూడ‌ద‌ని.. ప్ర‌జ‌ల కడుపు చూస్త‌ద‌ని వ్యాఖ్యానిం చారు. ఈ క్ర‌మంలో అనేక స‌వాళ్లు ఉన్నాయ‌ని చెప్పారు. టీఆర్ ఎస్ పాంచ‌జ‌న్యం పూరించ‌నుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు కూడా.. బంధుప్రీతి, అవినీతి, అధ‌ర్మంతో నిండిపోయాయ‌న్నారు.
 
పాంచ‌జ‌న్యం(panchajanyam) పేరుతో 5 కీల‌క‌ హామీలను కూడా క‌విత‌ ప్ర‌క‌టించారు. తాము అధికారంలోకి రాగానే.. విద్య‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. గుడిని ఎంత ప‌విత్రంగా చూస్తామో.. బ‌డిని కూడా అంతే ప‌విత్రంగా చూస్తామ న్నారు. ఈ క్ర‌మంలో ఉచిత విద్య‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. యూనివ‌ర్సిటీల నిర్వ‌హ‌ణ బాధ్య‌త కూడా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంద‌న్నారు.
 
2) ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వ‌ను న్నట్టు క‌విత చెప్పారు. నేడు ఎక్క‌డ చూసిన ప్ర‌జ‌లు వైద్యం అంద‌క ఇబ్బందులు పడుతున్నార‌ని చెప్పారు. తాము వ‌చ్చాక మెరుగైన ఉచిత‌ వైద్యం అందేలా చూస్తామ‌న్నారు.
 
3) రైతే రాజు: రాష్ట్రంలో రైత‌న్న‌ను రాజును చేసే బాధ్య‌త‌ను టీఆర్ ఎస్ తీసుకుంటుంద‌ని క‌విత చెప్పారు. రైతే రాజు నినాదాన్ని నిజం చేస్తామ‌ని చెప్పారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామ‌ని చెప్పారు. ఎరువుల కొర‌త లేకుండా.. అవి ఎక్క‌డైనా ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
 
4)నాలుగు ల‌క్షల ఉద్యోగాలు: టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటుతోనే యువ‌త క‌ల‌ల‌ను సాకారం చేస్తామ‌ని క‌విత చెప్పారు. వ‌చ్చీరావ‌డంతోనే 4 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 2 ల‌క్ష‌ల నుంచి 20 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు రుణాలు ఇచ్చి.. వారిని ఆర్థికంగా డెవ‌ల‌ప్ అయ్యేలా చేస్తామ‌న్నారు.
 
5) ఉచిత విద్యుత్‌: తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డంతోనే.. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఉచిత విద్యుత్ ఇవ్వ‌నున్న‌ట్టు క‌విత ప్ర‌క‌టించారు. వీటితోపాటు ఉద్య‌మ‌కారుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌కు హామీ ఇచ్చారు. అలానే.. ఎస్సీ, ఎస్టీ, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు మేలు చేసేలా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు.
Tags
Kalvakuntla Kavitha panchajanyam 5 guarantees trs new party
Recent Comments
Leave a Comment

Related News