ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై సుమారు రెండు గంటలపాటు చర్చ జరిగింది.
టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీల ఎంపీలు బిల్లుకు మద్దతు తెలిపారు. వైసీపీ సభ్యులు చర్చలో పాల్గొని తర్వాత వాకౌట్ చేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లుకు ఆమోదం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని, ఇంచు కూడా కదిలించలేరని ఆయన అన్నారు.అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని, ఇది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించి, లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఆ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 2 నా ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్తుంది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారుతుంది.