వైసీపీని వెంటాడుతున్న 11

admin
Published by Admin — March 31, 2026 in Politics
News Image

వైసీపీకి గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను 11 సంఖ్య వెంటాడుతోంది. నిను వీడనినీడను నేనే అంటూ వైసీపీ ఎక్కడకు వెళితే అక్కడకు వస్తోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పదకొండు పంచాయతీతో వైసీపీకి షాక్ తగిలింది. మొదటి అంతస్తులో 11వ నెంబర్ రూమ్ ను వైసీపీకి స్పీకర్ కేటాయించారు. దీంతో, వైసీపీ ఎంపీలకి చెమటలు పట్టేశాయి. 

"సార్.. మాకు ఆ రూమ్ తాళం వద్దు, ఆ నెంబర్ బోర్డు అస్సలే వద్దు! ఆ అంకె చూస్తుంటే మాకు అసెంబ్లీలో పడ్డ సీట్లు గుర్తొచ్చి కన్నీళ్లు ఆగడం లేదు" అని మొరపెట్టుకున్నారట. అవసరమైతే వరండాలో కూర్చుంటాం కానీ, ఆ 11వ నెంబర్ గదిలోకి మాత్రం అడుగుపెట్టం" అని భీష్మించుకు కూర్చున్నారట. 11 అంటే అది కేవలం సంఖ్య కాదు.. అది ఒక చేదు జ్ఞాపకం! అందుకే వెంటనే ఆ రూమ్ మార్చాలని కండీషన్ పెట్టారు. వారి ఆవేదన చూసి స్పీకర్ గారు మనసు కరిగించుకుని, వెనువెంటనే 12వ నెంబర్‌ గది ఇచ్చారట.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. పక్కనే టీడీపీకి 9వ నెంబర్ రూమ్ ఇచ్చారు. "వారికి అదృష్ట నవరత్నాల సంఖ్య ఇచ్చి, మాకు మాత్రం ఈ 'అసెంబ్లీ కౌంట్' ఎందుకు సార్?" అన్నది వైసీపీ నేతల అంతర్గత మధనం. రూమ్ నెంబర్ మారితే రాత మారుతుందో లేదో తెలియదు కానీ, అంకెలకు భయపడే స్థాయికి రాజకీయం చేరిందంటే.. ఆ '11' కి ఉన్న పవర్ అలాంటిది మరి!

Tags
ycp number 11 11 mlas haunting parliament room for ycp
Recent Comments
Leave a Comment

Related News