సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లి గురించి వచ్చే పుకార్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క నుంచి త్రిష వరకు అందరి విషయంలోనూ ఏదో ఒక వార్త నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఒక స్టార్ హీరోయిన్ మాత్రం వీరందరికీ భిన్నంగా తన లైఫ్ గురించి అత్యంత సంచలన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమే మలయాళ ముద్దుగుమ్మ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi).
సాధారణంగా ఏ అమ్మాయికైనా యవ్వనంలో పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. ఐశ్వర్య కూడా అందుకు మినహాయింపు కాదు. ఒకానొక సమయంలో కెరీర్‌ను పక్కనపెట్టి, వివాహ బంధంలో స్థిరపడాలని ఆమె బలంగా అనుకుంది. ఎంతలా అంటే.. తన పెళ్లి(Marriage) కోసం ఏకంగా ఒక మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకునేంత. అయితే, అది ఒక హీరోయిన్ ప్రొఫైల్ అని ఎవరూ నమ్మలేకపోయారు. చాలామంది అది ఫేక్ ఐడీ అని భావించడంతో ఆమెకు వింత అనుభవాలు ఎదురయ్యాయి. సరిగ్గా అదే సమయంలోనే ఆమె ఆలోచనా దృక్పథంలో ఒక పెద్ద మార్పు మొదలైంది.
ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో ఉన్న ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)కి.. 29 ఏళ్లప్పుడే ఒక గొప్ప స్పష్టత వచ్చిందట. గత ఐదేళ్లుగా ఆమె తన చుట్టూ ఉన్న సమాజాన్ని, పెళ్లయిన జంటలను గమనిస్తూ వచ్చింది. తను చూసిన ఎన్నో పెళ్లిళ్లలో నిజమైన సంతోషం, మనశ్శాంతి ఉన్న జంటల సంఖ్య చాలా తక్కువని ఆమె గ్రహించింది.``చాలామంది పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత ఎదుగుదలను, కెరీర్‌ను కోల్పోతున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు`` అని ఆమె కుండబద్దలు కొట్టేసింది.
సంతోషకరమైన జీవితానికి వివాహం ఒక తప్పనిసరి కండిషన్ కాదని ఐశ్వర్య గట్టిగా చెబుతోంది. అయితే, ఆమె ఒంటరిగా ఉండిపోతానని చెప్పడం లేదు. మనసు కలిసిన వ్యక్తి దొరికితే.. పెళ్లితో సంబంధం లేకుండా బంధాన్ని కొనసాగించడమే బెటర్ అని ఆమె అభిప్రాయపడింది. అంటే, అవసరమైతే సహజీవనం(Live-in) చేయడానికి సిద్ధమని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. వైవాహిక బంధంలోని చట్టపరమైన చిక్కులు, ఒత్తిళ్ల కంటే.. పరస్పర అంగీకారంతో సాగే బంధమే మిన్న అని ఆమె భావిస్తుండటం గమనార్హం.