సీబీఐ దర్యాప్తుపై సునీత షాకింగ్ కామెంట్స్

admin
Published by Admin — March 15, 2026 in Politics
News Image
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు(viveka's murder case)ను సీబీఐ(cbi) దర్యాప్తు(probe) చేస్తున్న తీరుపై ఆయన కుమార్తె సునీత(sunitha) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి, కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల వాంగ్మూలాల్లో తేడాలున్నాయని ఆరోపించారు. వారు చెప్పింది నిజమా కాదా అనే విషయాన్ని సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని సునీత ప్రశ్నించారు. ఎవరిని రక్షించేందుకు ఇలా చేస్తున్నారని నిలదీశారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తులో తప్పులను సరిచేసుకోవాలని కోరారు.

సీబీఐ బాధ్యతగా విచారణ చేయలేదని, తన తండ్రి హత్య కేసులో అందరూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక నిందితుల విషయంలో చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా విచారణ చేపట్టలేదని ఆరోపించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను సీబీఐ సీరియస్ గా తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. హత్య జరగడానికి ముందు, తర్వాత కిరణ్ యాదవ్ చాలామందితో ఫోన్లో మాట్లాడారని, సాక్షిలో గుండెపోటుతో వివేకా మృతి అని రావడానికి ఒక నిమిషం ముందే అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ మెసేజ్ పంపాడని ఆరోపించారు.

కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రాసుకుని వచ్చారని, సీబీఐ లోతుగా విచారణ జరపలేదని ఆరోపణలు గుప్పించారు. హత్య తర్వాత నిందితులు అందరి మధ్య ఫోన్లో సంభాషణలు, మేసేజ్లు అత్యధికంగా జరిగాయని అన్నారు. ఇతర ఆధారాలు ఇవ్వాలని కోరితే తన దగ్గర ఉన్న అదనపు ఆధారాలను కోర్టుతో పాటు సీబీఐకి కూడా సమర్పించానని వెల్లడించారు. వాటిపైనా సీబీఐ లోతుగా విచారణ జరపలేదని ఆరోపించారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్(ex cm jagan), ఆయన సతీమణి భారతి(bharati)ని విచారణ జరపాల్సిన అవసరముందన్నారు. కానీ సీబీఐ వారిని విచారణ జరపలేదని, తాను ఈ స్థాయిలో
పోరాడుతున్నా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తన పోరాటం ఆగదుని, న్యాయం జరిగే వరకు చివరి వరకు కొనసాగిస్తానని అన్నారు.
Tags
viveka murderr case jagan sunitha reddy cbi probe shocking comments
Recent Comments
Leave a Comment

Related News