కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం అధినేత దళపతి విజయ్(Thalapathy Vijay) వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్దిరోజులుగా విజయ్-సంగీత విడాకుల వ్యవహారం ముదురుతుండటంతో, నెటిజన్లు రకరకాల విశ్లేషణలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ వివాదంలోకి స్టార్ హీరోయిన్ త్రిష పేరు రావడం, దానికి తోడు విజయ్ రాజకీయ పార్టీ పేరును కూడా దీనికి ముడిపెట్టడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది.
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారని, దానికి ప్రధాన కారణం విజయ్ ఒక నటితో సన్నిహితంగా ఉండటమేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నెటిజన్లు ఆ నటి త్రిష(Trisha)నే అని ఫిక్స్ అయిపోయారు. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, ‘లియో’ షూటింగ్ సమయంలో వీరి మధ్య ఉన్న బాండింగ్ గురించి కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ పార్టీ పేరుకు త్రిషతో లింక్ పెడుతూ నెట్టింత కొత్త రచ్చకు తెర లేపారు.
విజయ్ తన రాజకీయ పార్టీకి ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కొందరు నెటిజన్లు ఈ పేరు వెనుక ఒక సీక్రెట్ ఉందంటున్నారు. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. ఈ పేరు మధ్యలో విజయ్ పేరును చేర్చి.. `Trisha Vijay Krishnan` అని, దాని షార్ట్ ఫామే ఈ TVK అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనపై ఉన్న ఇష్టంతోనే విజయ్ తన పార్టీ పేరులో త్రిష పేరు కలిసి వచ్చేలా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, విజయ్(Vijay) అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని ప్రత్యర్థులే ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ‘తమిళగ వెట్రి కజగం’ అంటే ‘తమిళనాడు విజయ్ పార్టీ’ అని అర్థమే తప్ప, అందులో ఎలాంటి వ్యక్తిగత పేర్లు లేవని వారు వాదిస్తున్నారు. విజయ్ ప్రతిష్టను దిగజార్చడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ పార్టీని కలిపి బురదజల్లుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.