అమ్మ(mother) అనే మాటకే మచ్చ తెచ్చేలా వ్యవహరించిందో పిశాచితల్లి. మారిన తన తీరును ప్రశ్నించటమే కాదు.. తనతో మాట్లాడటం మానేసిన కూతురి పట్ల అత్యంత దుర్మార్గంగా.. కసాయితనంతో వ్యవహరించిన ఈ తల్లి వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న తల్లిని ప్రశ్నించి.. తీరు మార్చుకోవాలన్న కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడి చేత అత్యాచారం చేయించిన హేయమైన ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
చెన్నై(Chennai) మహానగరంలోని సాలిగ్రామానికి చెందిన ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఇతనికి భార్య.. ఇరవై ఏళ్ల కూతురు ఉన్నారు. సెక్యూరిటీ గార్డుగా ఉంటే.. విధుల నిర్వహణలో భాగంగా వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లే కారణంగా.. అతడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని(illicit affair) పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకునేది.ఈ తీరును ఆమె కుమార్తె తీవ్రంగా తప్పు పట్టింది.
తాను ఎంత చెప్పినా తన తల్లి తీరు మార్చుకోకపోవటంతో.. ఆమెతో మాట్లాడటం మానేసింది కూతురు. ఇదిలా ఉండగా గత నెలలో కూతురు(daughter) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు మందులు ఇచ్చే క్రమంలో నిద్ర మాత్రల్ని కలిపి ఇచ్చిన తల్లి దుర్మార్గంలో ఆమె మత్తులో ఉండిపోయింది. ఆ సమయంలోనే తన ప్రియుడ్ని పిలిపించిన ఆమె కూతురిపై అత్యాచారం(rape) చేయించింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 23న యువతికిమళ్లీ అనారోగ్యంగా ఉండటంతో మళ్లీ తల్లి నిద్రమాత్రలు ఇచ్చింది. ఈసారి అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో స్ర్పహలోకి వచ్చిన యువతి పెద్దగా కేకలు వేయటంతో.. బయటకు చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చిన తల్లి.. ఆమెను ఇంట్లో ఉంచి తాళం వేసింది. చివరకు ఇంటి నుంచి తప్పించుకున్న ఆ యువతి.. తిరుమణ్ణామలైలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.
ఈ నేపథ్యంలో కడుపునొప్పితో బాధపడుతున్న యువతిని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భవతి అయినట్లుగా తేల్చారు. దీంతో ఆమె సెయ్యారు మహిళా పోలీస్ స్టేషన్(police station) లో తల్లి.. ఆమె ప్రియుడు 50 ఏళ్ల దక్షిణామూర్తిపై కంప్లైంట్ చేశారు. ఈ కేసును వడపళని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి.. అక్కడ కేసు(case) కట్టి విచారణ మొదలు పెట్టారు.ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.