వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఏమీ మారలేదు. మరోసారి ఆయన పోలీసులపై నోరు చేసుకున్నారు. ``మీ అంతు చూస్తా`` అని రెచ్చిపోయారు. దీంతో వైసీపీలోనే అంబటి ఇంకా మార లేదు.. అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుర్భాషలాడిన కేసులో జైలు పాలైన అంబ టి.. బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి నుంచి వాహన శ్రేణితో హడావుడి చేసుకుంటూ గుంటూరుకు వచ్చారు.
ఈ క్రమంలో గుంటూరు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే.. అంబటి వాహన శ్రేణి.. ఇష్టానుసా రంగా రోడ్లపై వాహనాలు నడపడంతో ఎస్సై వెంకట్.. వైసీపీ నాయకులను హెచ్చరించారు. వాహనాలను క్రమ పద్ధతిలో నడపాలని సూచించారు. దీనికి వైసీపీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. నాయకు లు, కార్యకర్తలు.. పోలీసులకు వేళ్లు చూపిస్తూ.. హెచ్చరించారు. ఈ విషయం తెలిసిన.. అంబటి మరింత రెచ్చిపోయారు.
``మమ్మేల్నే అడ్డుకుంటున్నావా?`` అంటూ.. ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు.. ఈ ఆవేశంలో ``నీ అంతు చూస్తా`` - అంటూ అంబటి రెచ్చిపోయారు. దీంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. అనంత రం.. అదే పద్ధతిలో వాహన శ్రేణిని ముందుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై వైసీపీలోనూ.. చర్చగా మారింది. అంబటి రాంబాబు ఏదో అనుకుంటున్నారని.. ఇలా వ్యవహరించడం సరికాదని మెజారిటీ నాయకులు కూడా వ్యాఖ్యానించారు.