కౌంటర్ అంటే ఇది, అన్నాడీఎంకే మైండ్ బ్లాక్ అయ్యే వీడియో.. !

admin
Published by Admin — February 18, 2026 in Politics, National
News Image

ఎన్నికల సమయంలో తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. విజయ లక్ష్మి కోసం అక్కడి రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమిళ ప్రజలను ఆకట్టుకునే విధంగా విమర్శలు, ప్రకటనలు, ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష అన్నాడిఎంకే ఓ ఇంట్రస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తమిళనాడు సర్కార్ ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్ ను ఓ ఆట ఆదుకుంది అన్నాడిఎంకే. బడ్జెట్ పేరుతో ప్రజల చెవులకు పోగులు కుట్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎద్దేవా చేసింది. 

మంగళవారం ఆర్ధిక మంత్రి తంగం తేన్నరసు తాత్కాలిక బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టగా, సభకు అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు ఓ వింత ఆహ్వాన పత్రికతో ఎంట్రీ ఇచ్చారు. 'బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది' అని ఆరోపిస్తూ ముహూర్తం కూడా అందులో ప్రచురించారు. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి 'ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని సెటైరికల్ గా ఆహ్వాన పత్రిక రెడీ చేసింది. 

అంతే కాకుండా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఓ వీడియో కూడా డిజైన్ చేసింది. గత నాలుగున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిందన్న అన్నాడిఎంకే, ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమైందని తెలుపుతూ వీడియో చేసింది. అధికార డిఎంకే నేతలు ఓ పెద్ద సూది పట్టుకుని ప్రజలకు చెవులు కుట్టేందుకు వారి ఇళ్ళ వెంట తిరుగుతూ ఉంటారు. వారిని చూసి ప్రజలు భయపడి పరుగులు తీస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్ళు క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు.

Tags
AIADMK Tamil Nadu Tamil Nadu Politics DMK INC TMC Palaniswami M K Stalin
Recent Comments
Leave a Comment

Related News

Latest News