జ‌గ‌న్‌కు వాడుకుని వ‌దిలేయ‌డ‌మే తెలుసా.. !

admin
Published by Admin — February 03, 2026 in Andhra
News Image

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ముఖ్యంగా వైసీపీ నాయకుల వ్యవహారాలను గమనిస్తే వారు రెచ్చిపోతున్న విధానం అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని చేస్తున్న దుర్భాషలు వంటివి జగన్ ప్రోద్బ‌లంతోనే జరుగుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోను ఆసక్తికర చర్చ నడుస్తుంది. తరచుగా జరుగుతున్న సమావేశాలు.. నియోజకవర్గాల వారీగా జగన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగా ఉంటున్నాయని అందుకే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అదేవిధంగా మంత్రి లోకేష్ పైన నాయకులు తీవ్ర స్థాయిల విమర్శలు గుర్తిస్తున్నారనే వాదన వినిపిస్తోం ది. వాస్తవానికి జగన్ వ్యవహార శైలిని గమనిస్తే ఆయన ఎవరినైనా సరే తన లబ్ధి కోసమే వాడుకున్నారు అన్న విషయం అర్థం అవుతుంది. గతంలో సొంత సోదరి ష‌ర్మిల‌ తనకోసం పాదయాత్ర చేసినా ఆమెకు కనీసం చిన్న పదవిని కూడా ఇవ్వకుండా అవమానించారన్న వాదన ఉంది. ఇక సొంత బాబాయి దారుణ హత్యకు గురైనప్పుడు ఆయన కుమార్తె డాక్టర్ సునీత అనేకమార్లు జగన్కు వేడుకున్నా ఆమెను కూడా పట్టించుకోకుండా ఛీత్క‌రించారు అన్న వాదన ఆమె స్వయంగా చెప్పారు.

ఇది కుటుంబ పరంగా జరిగిన వ్యవహారం. ఇక రాజకీయంగా చూస్తే అనేకమంది నాయకులను వైసీపీ అధినేత జగన్ వాడుకుని వదిలేసారు అన్న వాదన బలంగా వినిపించింది. ఉదాహరణకు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను 2019లో ఎన్నికలకు దూరంగా పెట్టి మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేందుకు మూడు సంవత్సరాలకు పైగా సమయం తీసుకున్నారు.

అదే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు కూడా ఆయన అవమానించారన్న వాదన వినిపించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి, పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన వెంట వచ్చిన వారిలో ఒకరు ఇద్దరు నేతలు వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు దక్కుతాయని భావించారు. కానీ వారికి కూడా మొండి చేయి చూపించారు. కనీసం వారికి ప్రాధాన్యం కూడా ఇవ్వకుండా అవమానించార‌న్న బాధ ఉంది. ఇలా, జగన్ తన పార్టీ నాయకుల్ని వాడుకుని వదిలేసే పరిస్థితి ఉన్న వ్యక్తిగా ముద్రపడ్డారు.

ఇప్పుడు కూడా ఇలానే కొంతమంది నాయకులను రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబు పైన లోకేష్‌ పైన విమర్శలు చేయించడం ద్వారా వారినుంచి జ‌గ‌న్ లబ్ధి కోరుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. అంతే తప్ప వారి కోసం జగన్ చేస్తున్నది ఏమీ లేదన్నది పరిశీలకులు చెబుతున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో జరిగిన పరిణామాలు, పరాభవాలు అందరికీ తెలిసిందే. అనేకమంది నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోవడానికి తమను అవమానించార‌న్న కారణమేన‌ని స్పష్టంగా తెలుస్తోంది.

సో మొత్తంగా చూస్తే జగన్‌కు ఉన్న ప్రధానమైన లక్షణం వాడుకోవడం వదిలేయడం అనేదేనని చాలామంది నాయకులు గతంలో చెప్పుకొచ్చారు. వీరిలో ఎం వి మైసూరా రెడ్డిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన వైసీపీ పెట్టిన కొత్తలోనే పార్టీలో చేరారు. కానీ ఆయన వెంటనే బయటకు వచ్చేసి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కారణం ఆయనకు వాడుకుని వదిలేసే లక్షణమే ఉందని నాయకులను గౌరవించడం కానీ ఒక పద్ధతిగా పార్టీని నడిపించడం గాని తెలియదని మైసూరారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సో జగన్ పరిస్థితిని నాయకులకు గమనించాల్సిన అవసరం ఉంది. జగన్ అంటే అభిమానం ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఇమేజ్‌ను తగ్గించుకునే దిశగా నాయకులు అడుగులు వేస్తే అది వారికి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఇప్పటికైనా నాయకులు మారతారా లేదా అనేది చూడాలి.

Tags
Jagan selfish ycp activists
Recent Comments
Leave a Comment

Related News