పిల్లాడి సైకిల్‌తో వైసీపీ సైకోల వికృత చేష్టలు.. ఇక వీళ్లు మార‌రు..!

admin
Published by Admin — June 01, 2025 in Andhra, Politics
News Image

వైసీపీ లో సైకోలకు కొదవలేదు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువయింది. గత ఏడాది ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు బడాయి రాజకీయాలు మాత్రం మానుకోవ‌ట్లేదు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే జోగి రమేష్ ఇంట శుభకార్యం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు రాజకీయంగా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ వ‌ల్ల ఎటువంటి సమస్య లేదు. కానీ ర్యాలీలో వైసీపీ కార్యకర్తల వికృత చేష్ట‌లే ఇప్పుడు విమర్శలకు దారితీశాయి.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి పెళ్లి సంద‌ర్భంగా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో రోడ్డుపై ఓ చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ అటుగా వ‌చ్చాడు. అది గ‌మ‌నించిన కొంద‌రు వైసీపీ సైకోలు ఆ పిల్లాడి ద‌గ్గ‌ర నుంచి సైకిల్ లాక్కుని.. నేలకేసి కొడుతూ..కాళ్ల‌తో తొక్కుతూ తమ పైశాచిక ఆనందాన్ని పొందారు. అది చూసి చుట్టూ ఉన్న పార్టీ కార్య‌క‌ర్త‌లు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు.

కానీ ఆ చిన్న పిల్లాడు మాత్రం తన సైకిల్ ఎందుకు లాక్కున్నారో తెలియ‌క బిక్కుబిక్క‌మంటూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల తీరుపై తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఎంత ప్ర‌తిప‌క్షంలో ఉంటే.. ఇంత‌లా దిగ‌జారిపోవాలా? అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ విష‌యంపై రియాక్ట్ అయ్యారు.

`అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను.. చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలి. మైలవరం లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా.` అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Tags
AP News Cycle Jogi ramesh nara lokesh rally TDP
Recent Comments
Leave a Comment

Related News