రేవంత్ రెడ్డికి షాక్‌.. బ‌న్నీ ఈసారి కావాల‌నే అలా చేశాడా?

admin
Published by Admin — May 30, 2025 in Telangana, Movies
News Image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ షాక్ ఇచ్చాడు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో పొరపాటున రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయాడు బ‌న్నీ. ఆ కాక్షతోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవంత్‌ సర్కార్ బ‌న్నీని జైలుకు పంపార‌నే టాక్ బలంగా ఉంది. ఈ ఇష్యూ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న బ‌న్నీ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశాడు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభను గౌరవించేందుకు సిద్ధ‌మైంది. ప్రజా గాయకుడు గద్దర్ గారి స్మృతిలో అవార్డులు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది.

అందులో భాగంగానే 2024 కి గాను గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల విజేత‌ల‌ను గురువారం ప్ర‌క‌టించ‌బ‌డ్డాయి. ఈ అవార్డులలో పుష్ప 2 చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ ఎంపికయ్యారు. ఈ విష‌యంపై ఎక్స్ వేదిక‌గా రియాక్ట్ అయిన అల్లు అర్జున్‌.. `గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌ 2024లో పుష్ప 2 చిత్రానికి మొదటి ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా దర్శకుడు సుకుమార్ గారు, నా నిర్మాతలు మరియు మొత్తం పుష్ప బృందానికి అన్ని క్రెడిట్లు దక్కుతాయి. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను, మీ నిరంతర మద్దతు నాకు స్ఫూర్తినిస్తూనే ఉంది.` అంటూ ట్వీట్ చేశారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన బ‌న్నీ.. త‌న ట్వీట్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేరును మాత్రం ట్యాగ్ చేయ‌లేదు. పైగా అవార్డును ఫ్యాన్స్‌కి అంకితం చేసేశాడు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. గద్దర్‌ అవార్డులు పొందిన మిగతా నటీనటులు, సినిమా ప్రముఖులు రేవంత్‌ రెడ్డికి ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. కానీ బ‌న్నీ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా ఈసారి బ‌న్నీ కావాల‌నే రేవంత్ రెడ్డి పేరును ప్ర‌స్తావించ‌లేదని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags
allu arjun cm revanth reddy gaddar awards
Recent Comments
Leave a Comment

Related News