టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన చిత్రాల్లో `ఖలేజా` ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సునీల్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం 2010లో మహేష్ బాబు నుంచి వచ్చిన ఖలేజా చిత్రం అప్పట్లో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను నిరాశ పరిచింది.
దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం చాలా మందికి పెద్దగా అర్థం కాలేదు. అయితే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఖలేజా మూవీ బుల్లితెరపై అడుగుపెట్టాక కల్ట్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజుగా మహేష్ నటన, కామెడీ టైమింగ్, ఇంటర్వెల్ ఫైట్, అనుష్క గ్లామర్, త్రివిక్రమ్ టేకింగ్, పాటలకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలోనే నేడు ఖలేజా చిత్రాన్ని 4కె వెర్షన్‌లో మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకున్నారు. రీరిలీజ్‌లో ఖలేజాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
థియేటర్స్ లో సినిమాను చూస్తూ డ్యాన్సులు వేస్తూ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఖలేజా మూవీకి మొదట `దైవం మనుష్య రూపేణ` అనే టైటిల్ అనుకున్నారు. కానీ టైటిల్ అంత గ్రిప్పింగ్‌గా లేకపోవడంతో `ఖిలాడీ`గా మార్చారు. ఆ తర్వాత ఏవో కారణాలతో ఖిలాడీ టైటిల్ ను మళ్లీ `ఖలేజా` గా చేశారు. ఈ టైటిల్ విషయంలో కూడా అప్పట్లో పెద్ద గొడవ అయ్యింది. సేమ్ టైటిల్ ను అప్పటికే వేరే చిన్న సినిమాకి రిజిస్టర్ చేసుకోవడంతో.. కోర్టులు, కేసులు అంటూ రచ్చ నడిచింది. దాంతో `మహేష్ ఖలేజా`గా టైటిల్ ను ఫైనల్ చేయడం జరిగింది. సినిమా పోస్టర్స్ పై మహేష్ ఖలేజా అనే ఉంటుంది. కానీ మహేష్ అన్న పేరు చాలా చిన్నగా కనిపిస్తుంది.