రూమర్ మిల్ ఆఫ్ 'తానా' గుస గుసా-పిండి పిండేనా?

NRI
*'తానా 'ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులు కొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై  గుస గుసలు.
*త్రిముఖ పోటీ నివారణకు ముక్కుసూటి తత్త్వం ఉండే 'శ్రీనివాస గోగినేని'ని మినహాయించి మిగతా ఇద్దరికీ మధ్య అవగాహన ప్రయత్నాలు కొనసాగింపు.
*ఇప్పటివరకు 'నిరంజన్ శృంగవరపు' వాక్కు: పోటీకి సై , విరమణకు నై , ఈయన పోటీపై బెట్టుకు సిద్ధమంటున్న బెట్టింగ్  బంగార్రాజులు.
*క్రితంసారి ఉపసంహరించుకున్నందున ఈ సారి పట్టు మీదున్న 'నరేన్ కొడాలి' వర్గం, దీనిపై కూడా బెట్టుకు సిద్ధమంటున్న పందెం రాయుళ్లు.
*అధిష్టానం అనేది నిజంగా ఉందని భావించే వారిలో ఇంకా ఎదో జరుగుద్దని నమ్మకం.
*అంత సీన్ లేదంటున్న వ్యతిరేక వాదులు, ఇంతటితో ఈ దందా ఫినిష్ అని ఫీలింగ్.
*ఈ సందులో బలం పుంజుకుంటున్న 'శ్రీనివాస గోగినేని'.ఇది చివరకు అదిష్టానం బుడ్డి ముంచే  ప్రమాదం ఉందంటున్న జ్యోతిష్కులు.
*ప్రస్తుత పదవిలోని సేవలు గట్టు చేరుస్తాయని 'నిరంజన్ శృంగవరపు' లెక్కలు.
*తన జంటిల్మన్ ఇమేజ్ పై ఉన్న నమ్మకంతో  'వేమన' శతకం శ్రద్దగా పఠిస్తున్న 'నరేన్ కొడాలి'.
*పట్టు జారుతుందేమోనని ఆందోళన పడుతున్న స్వయం ప్రకటిత అధిష్టానం.
*ఇదే అదునుగా సమీకృతమౌతున్న 'తానా' వ్యవహారాల అసంతృప్తవాదులు.
*గుంభనగా కాపిటల్ డిసి ఏరియా సభ్యులు.
*ఇద్దరు లోకల్ జెంటిల్ మెన్లు  ప్రెసిడెంట్ ఎలెక్ట్ కై కాంటెస్ట్ లో ఉన్న మిచిగాన్ రాష్ట్రంలో వేరే ఊర్లోని వాన్ని సమర్థిస్తున్న వారిని  విసుక్కుంటున్న  'డెట్రాయిటర్స్'.
*ఇదే కారణంతో తల పట్టుకుంటున్న ఊర్లోనే  వున్న 'తానా' మాంత్రికుడు
*జాతీయ స్థాయిలో త్రిముఖ పోటీ అనివార్యమైతే ముగ్గురికీ తలో 30 శాతం గ్యారంటీ ఓట్లు, మిగతా 10 శాతం మొగ్గు ఎటైనా కావచ్చు. బెట్టింగ్ బంగార్రాజులకు పండగే పండగ.
*ఇప్పుడు పదివిలో ఉన్నవారిలో ఎక్కువ మందిని తిరిగి పోటీ చేయించి పట్టు చూపించాలని 'నిరంజన్ శృంగవరపు' 'వర్గం యత్నం.
*వారిలో కొందరిని తస్కరించి ఆధిపత్యం చూపాలనుకుంటున్న 'నరేన్  కొడాలి'వర్గం.
*సిద్ధమైన  రెండు ప్యానెల్లు, వాటిల్లో  సగంమంది ఎందుకైనా మంచిదని 'శ్రీనివాస గోగినేని' తో కూడా సంప్రదింపులు.
*ఇంత సందట్లోనూ గమ్ముగా ఉన్న 'అట్లాంటా' వాసులు, 'గేమ్ క్లోజర్స్ 'వాళ్లేనని కొందరి  భావన.
*సముద్రంకంటే లోతైన 'లావు బ్రదర్స్ 'అంతరంగం, మాంత్రికుడికే అర్ధం కాని వైనం.
*అట్లాంటా తమదేనని అందరి ఆశా, అయినా పీడిస్తున్న అనుమాన భూతం.
*పూర్వపు లెక్కలన్నీ తేల్చే పనిలో అట్లాంటా వాసులు.
*డల్లాస్ లో యధావిధిగా 'జంతర్ మంతర్'.
*డల్లాస్ ఏ ఇద్దరు వరుసగా నాలుగేళ్లు కలసిఉండని 'తానా 'చరిత్ర, ఇంకోసారి పునరావృతమవుతున్న పరిస్థితులు.
*బే ఏరియాలో ఎవరు ఏ వర్గమో వారికే తెలియని విచిత్ర పరిస్థితి.
*ఎవరు గెలిచినా మా ఘనతే అనటానికి  రెడీ, కానీ ఎవరు ఓడినా వారి ఓటమే అని భయం.
*ఈ దెబ్బ తో 'తానా' సంస్థ గతీ గమనం మారుతుందని ఆశావహ దృక్పధం.
*నిర్లిప్తగా చూ స్తున్న పాత తరం, ఉత్సాహపరుస్తున్న ఆశావాదులు.
*గాడ్ ఫాదర్స్  నీడలో పదవి పొందాలనుకునే వారిలో ఎప్పుడూ కనపడని గందరగోళం. చూసి నవ్వుకుంటున్న ఇరుగుపొరుగు మిత్రులు.
*ఈ టర్మ్ పదవి ప్రామిస్ తో లాస్ట్ టర్మ్ తప్పుకున్నవారిలో భయం, ఎటుపోవాలో ఎవరిని అడగాలో తెలియక తికమక.
*అన్ని నగరాల్లో పోటీల గురించి మొదలైన చర్చలు, రీజినల్  పోటీలపై పెరుగుతున్న ఆశావహులు.
*ఏదో ఒక ప్యానెల్లో చేరటానికి అటు ఇటు పరుగులు. ఎవరు ఒప్పుకున్నా 30 శాతం ఓట్లు గారంటీ అనే ధీమా.
*ఇంకా మంచివారికై  ప్యానెళ్లలో ఎదురుచూపులు.
*సందట్లో సడేమియాల్లాగా  'జంప్ జిలానీలు'.
*ఇటూ అటూ మాట్లాడుతూ, కాల్ రికార్డింగులు చేస్తూ రహస్యాలు  చేరవేసే నక్క జిత్తులగాళ్లు, సిగ్గు ఎగ్గూ లేని డబల్ ఏజెంట్లు.
*వారినే  తెలివిగా వాడుకుంటూ సెలెక్టీవ్ గా ఇన్ఫర్మేషన్  ఇస్తున్న ఇంటెలిజెంట్ అభ్యర్థులు.
*సరి కొత్త 'తానా 'లో తమదైన పాత్రకి సమాయత్తమౌతున్న ఔత్సాహిక  వాలంటీర్స్ , భవిష్యత్ పై ఆశావహ దృక్పధం.
*అనేక  నగరాల్లోని  స్థానిక తెలుగు సంఘాల సభ్యుల్లో'తానా'సభ్యత్వమున్నవారు కూడా పోటీకి ఆలోచన.
*100 పైగా పదవులు, జాతీయ స్థాయి ఫేమ్ , మరిన్ని భవిష్యత్తు అవకాశాల మూలంగా  అందరిలో పెరుగుతున్న పోటీ ఉత్సాహం.
*స్నేహ పూర్వహాక పోటీ తప్పులేదంటున్న పెద్దలు.
                                                                                              సశేషం..
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.