పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కేసు... ఐజీ సంచ‌ల‌న విష‌యాలు!

News Image

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్‌.. మృతి వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఇది హ‌త్యేన‌ని కొంద‌రు వాద‌న‌కు దిగారు. రాజ‌కీయంగా కూడా ఇది పెద్ద విష‌యంగా తెర‌మీదికి వ‌చ్చింది. అనేక వార్త‌లు.. అనేక విమ‌ర్శ‌లు.. కూడా  ఈ మృతి చుట్టూ చోటు చేసుకున్నాయి. తాజాగా దీనిపై ఏలూరు ఐజీ అశోక్‌కుమార్ మీడియాకు ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు.

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ మృతి కేసులో ఎవ‌రి ప్ర‌మేయం లేద‌న్నారు. ఆయ‌న ప్ర‌యాణించిన బుల్లెట్‌ను ఇ తర ఏ వాహ‌నం కూడా ఢీ కొట్ట‌లేద‌ని తెలిపారు. ప‌లు మార్లు ఆయ‌న మ‌ద్యం దుకాణాల‌కు వెళ్లి న‌గ‌దు చె ల్లించిన‌ట్టు ఫోన్ పే ఖాతా ద్వారా తెలుసుకున్నామ‌న్నారు. అదేవిధంగా కోదాడ నుంచి ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం వ‌ర‌కు.. కూడా ప‌లుమార్లు ప్ర‌వీణ్ కుమార్‌.. ప‌డిపోయిన‌ట్టు సీసీ రికార్డుల ద్వారా తెలిసింద‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌, ఏలూరులో ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌న్నారు.

విజ‌య‌వాడ చేరుకునే స‌రికి ప్ర‌వీణ్ ప్ర‌యాణిస్తున్న బుల్లెట్ కు హెడ్ లైట్ ప‌గిలిపోయింద‌న్నారు. ఏలూ రులో ని మ‌ద్యం దుకాణానికి వ‌చ్చే స‌రికి.. ఆయ‌న క‌ళ్ల‌జోడులో ఒక అద్దం కూడాలేద‌ని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక ప్ర‌కారం.. మ‌ద్యం తాలూకు ఆన‌వాళ్లు ప్ర‌వీణ్ దేహంలో క‌నిపించాయ‌ని.. అదేవిధంగా ఆయ‌న వాహ‌నాన్ని ఇత‌ర ఏ వాహ‌నం కూడా ఢీ కొట్ట‌లేద‌ని చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన చోట.. బుల్లెట్‌కు, ఇత‌ర వాహ‌నాల‌కు మ‌ధ్య గ్యాప్ ఎక్కువ‌గానే ఉంద‌న్నారు.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న స‌మాచారాన్ని.. వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని ఐజీ కోరారు. దీనిపై అన్ని వైపుల నుంచి కూలంక‌షంగా విచార‌ణ జ‌రిపిన‌ట్టు తెలిపారు. అనేక మంది సాక్షుల‌ను కూడా విచారించా మని, ప్ర‌వీణ్ కుటుంబానికి పోలీసు విచార‌ణ‌పై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్న విష‌యాన్నిఈ సంద‌ర్భంగా ఐజీ ప్ర‌స్తావించారు. దీనిపై ఎవ‌రూ దుష్ప్ర‌చారం చేయొద్ద‌ని ఆయ‌న కోరారు. పూర్తి నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించ‌నున్న‌ట్టు తెలిపారు.

Recent Comments
Leave a Comment

Related News