ఒంట‌రిత‌నం భ‌యంక‌రంగా ఉంది.. స‌మంత పోస్ట్..!

admin
Published by Admin — February 20, 2025 in Movies
News Image

అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం నుంచి కెమెరాకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యూటీ స‌మంత మళ్లీ ఇప్పుడిప్పుడే వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంది. సినిమాల కంటే వెబ్ సిరీస్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రొఫెషనల్ విషయాలే కాకుండా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విశేషాల‌ను కూడా పంచుకునే సమంత.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన అనుభవాలు సమంత తన ఫాలోవర్స్ తో పంచుకుంది. `మూడు రోజులు సైలెంట్ గా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను. మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇది ప్రయత్నించండి` అంటూ సమంత పోస్ట్ పెట్టగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags
Actress Samantha Latest news samantha
Recent Comments
Leave a Comment

Related News