భ‌ర్త సూసైడ్.. రెండో పెళ్లికి సిద్ధ‌మైన టాలీవుడ్ హీరోయిన్‌!

admin
Published by Admin — February 17, 2025 in Movies
News Image

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ పావని రెడ్డి రెండో పెళ్లికి సిద్ధ‌మైంది. డాన్స్ కొరియోగ్రాఫర్ అమీర్ భాస్క‌ర్ తో త్వ‌ర‌లో ఏడడుగులు వేయ‌బోతోంది. ఈ గుడ్ న్యూస్ ను పావ‌ని రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంది. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నామ‌ని.. సముద్రం సాక్షిగా ఒకరికొకరు తోడుంటామని మాటిచ్చుకున్నామ‌ని తెలుపుతూ పావ‌ని రెడ్డి ఓ వీడియోను పంచుకుంది. ఏప్రిల్ 20న పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో.. నెటిజ‌న్లు, అభిమానులు పావ‌ని, అమీర్ జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పావ‌ని.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది. తెలుగులో డబుల్ ట్రబుల్, డ్రీమ్, గౌరవం, అమృతం చందమామలో, సేనాపతి, మ‌ళ్లీ మొద‌లైంది త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. త‌మిళంలోనూ సినిమాలు చేసిన పావ‌ని రెడ్డి.. బుల్లితెర‌పై తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో చాలా సీరియ‌ల్స్ లో యాక్ట్ చేసింది. 2016లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్‌తో డేటింగ్ ప్రారంభించిన పావ‌ని రెడ్డి.. అదే ఏడాది న‌వంబ‌ర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2017 ఫిబ్రవరి 14న ప్ర‌దీప్‌, పావ‌ని వివాహం చేసుకున్నారు.

కానీ పెళ్లైన కొద్ది రోజుల‌కే ప్రదీప్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. 2017 మేలో ప్రదీప్ హైదరాబాద్‌ పుప్పల్‌గూడలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. అప్ప‌ట్లో ఈ విష‌యం వార్త‌ల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన పావ‌ని.. 2022లో బిగ్ బాస్ తమిళ్ సీజ‌న్ 5లో పాల్గొంది. లేడీ శివంగిలా తన ఆట తీరుతో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గ‌ట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. అయితే ఇక్క‌డ మ‌రొక విష‌యం కూడా జ‌రిగింది. అదే సీజ‌న్ లో పాల్గొన డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్ అమీర్ తో పావ‌ని ప్రేమ‌లో ప‌డింది. దాదాపు మూడేళ్ల నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు

Tags
Actress Pavani Reddy Choreographer Amir kollywood
Recent Comments
Leave a Comment

Related News