రెండోసారి గుడ్‌న్యూస్ చెప్పిన ఇలియానా.. వీడియో వైర‌ల్‌!

News Image

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గోవా బ్యూటీ ఇలియానా ఒక గుడ్ న్యూస్ ను పంచుకుంది. రెండోసారి తాను ప్రెగ్నెంట్ అయిన‌ట్లు తెలియ‌జేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ప్రియుడు మైఖేల్ డోల‌న్ ను ఇలియానా వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు 2023 ఆగ‌స్టులో పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. కొడుకు పుట్టిన త‌ర్వాతే ఇలియానా త‌న భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ భ‌ర్త‌, కొడుకుతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా.. తాజాగా ఇన్‌స్టాలో 2024 గురించి ఓ షార్ట్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో జ‌న‌వ‌రి నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు త‌న ముద్దుల త‌న‌యుడు కోవా ఫీనిక్స్ డోల‌న్ తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిచిపోయిన‌ట్లు ఇలియానా తెలిపింది. అయితే అక్టోబ‌ర్ లో ఇలియానా రెండోసారి గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని తెలిపుతూ ప్రెగ్నెన్సీ కిట్ ను కూడా ఇలియానా వీడియోలో పంచుకుంది. 2025లో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు క‌న్ఫార్మ్ చేసేసింది. దీంతో ఇలియానా దంప‌తుల‌కు నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు విషెస్ చెబుతున్నారు. కాగా, గోవాకు చెందిన ఇలియానా.. 2003లో మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. ప‌లు యాడ్స్ లో న‌టిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవ‌దాసు` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ వెంట‌నే `పోకిరి`తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకుని భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నారు. 2006 నుంచి 2012 వ‌ర‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన ఇలియానా.. ప‌లు త‌మిళ సినిమాల్లోనూ న‌టించింది. ఇక్క‌డ మంచి ఫామ్ లోనే ఉండ‌గానే ఇలియానా క‌న్ను బాలీవుడ్ పై ప‌డింది. 2012 నుంచి 2018 వ‌ర‌కు హిందీలో సినిమాలు చేసింది. కానీ పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. అటు నార్త్ లో స‌క్సెస్ లేకపోవ‌డం, ఇటు సౌత్ లో ఛాన్సులు రాకపోవ‌డంతో ఇలియానా ఆల్మోస్ట్ ఫేడౌన్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

Recent Comments
Leave a Comment

Related News