రాజీనామా తర్వాత బాబుపై జీవీ రెడ్డి షాకింగ్ పోస్ట్‌!

News Image

ఇటీవల జీవీ రెడ్డి ఎపిసోడ్ ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ తో వివాదం చోటుచేసుకోవ‌డం, ఈ విష‌యంలో టీడీపీ నాయకత్వం సీరియస్ అయ్యి మంద‌లించ‌డంతో జీవి రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఆ పార్టీ కేడర్ మొత్తం ఒకటై ఆయనకు మద్దతుగా నిలిచింది. టీడీపీకి అత్యంత విధేయుడు అయిన జీవీ రెడ్డిని వదులుకునేందుకు కేడ‌ర్ ఏ మాత్రం ఇష్టపడలేదు. అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వేలాది పోస్ట్స్ కూడా పెట్టారు.

మ‌రోవైపు ఇదే అంశాన్ని విప‌క్ష వైసీపీ క్యాష్ చేసుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్ధేశిస్తూ జీవీ రెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టారు. శుక్ర‌వారం ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా జీవీ రెడ్డి త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా బ‌డ్జెట్ విష‌యంలో చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు.

`నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.

ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి . రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత` అంటూ రాజీనామా త‌ర్వాత జీవీ రెడ్డి తొలి ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Recent Comments
Leave a Comment

Related News