కౌశిక్ రెడ్డి కి ఊర‌ట‌.. బెయిల్ మంజూరు!

admin
Published by Admin — January 14, 2025 in Politics
News Image

బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, హూజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి ఊర‌ట ల‌భించింది. సం క్రాంతి పండుగ పూట ఆయ‌న జైలుకు వెళ్తారేమోన‌ని.. ఆయ‌న అభిమానులు, కుటుంబం.. పార్టీ కూడా తెగ ఆందోళ‌న ప‌డ్డాయి. కానీ, స్థానిక కోర్టు పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయ‌న సేఫ్ అయ్యారు. ఇక‌, పోలీసులుదాఖ‌లు చేసిన రిమాండ్ రిపోర్టులో కూడా.. అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని.. హ‌డావుడిగా ఈరిపోర్టును త‌యారు చేశార‌ని అనిపిస్తోంద‌ని జ‌డ్జి పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌లో రెండు రోజుల కింద‌ట జ‌రిగిన స‌మావేశంలో కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి మ‌ధ్య వాగ్యుద్ధం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. నువ్వెంత అంటే-నువ్వెంత అంటూ.. ఇరువురూ.. త‌ల పడ్డారు. ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో కౌశిక్‌రెడ్డి మ‌రింత దూకుడు పెంచారు. దీంతో వివాదంపై సంజీవ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీక‌ర్ అనుమ‌తితో క‌రీం న‌గ‌ర్ పోలీసులు సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో కౌశిక్‌రెడ్డిని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

అనంత‌రం క‌రీంన‌గ‌ర్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఉద‌యం.. ఆయ‌న‌కు తొలుత వైద్య ప‌రీక్ష‌ల‌కు తీసుకువెళ్లిన పోలీసులు.. కౌశిక్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని నిర్ధారించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. స్థానిక క‌రీం న‌గ‌ర్ కోర్టు ముందు ప్ర‌వేశ పెట్టారు. ఇదేస‌మ‌యంలో రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిని ప‌రిశీలించిన కోర్టు త‌ప్పుల త‌డ‌క‌గా ఉంద‌ని వ్యాఖ్యానించింది. ఇదేస‌మ‌యంలో కౌశిక్‌రెడ్డి త‌ర‌ఫున న్యాయ‌వాది జోక్యం చేసుకుని.. ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని పేర్కొన్నారు. కేసును కొట్టివేయాల‌ని కోరారు.

Recent Comments
Leave a Comment

Related News