నెల తిరగకముందే ఓటీటీలోకి `ది రాజాసాబ్‌`..!

admin
Published by Admin — January 30, 2026 in Movies
News Image

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది ఊహించని అప్‌డేట్. భారీ అంచనాల మధ్య థియేటర్లలో సందడి చేసిన `ది రాజాసాబ్` డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలోకి రావడానికి కనీసం 50 రోజుల సమయం పడుతుంది, కానీ ఈ హారర్ కామెడీ చిత్రం మాత్రం విడుదలైన నెల రోజులు కూడా గడవకముందే స్ట్రీమింగ్‌కు సిద్ధమవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకుడు మారుతి మేకింగ్‌లో ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు. థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌న‌ప్ప‌టికీ.. ప్రభాస్ కామెడీ టైమింగ్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది. ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ భారీ డీల్‌తో ది రాజా సాబ్‌ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రకారం, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రాజాసాబ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు, అలాగే ప్రభాస్ మ్యానరిజమ్స్‌ను మరోసారి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వీకెండ్ ట్రీట్ కానుంది.

కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ అందచందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. హారర్ ఎలిమెంట్స్‌కు తోడు మారుతి మార్క్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఓటీటీలో ఈ సినిమా భారీ వ్యూస్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్న రాజాసాబ్.. డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి!

Tags
The Raja Saab Prabhas Rebel Star Prabhas The Raja Saab OTT Jio Hotstar Maruthi
Recent Comments
Leave a Comment

Related News