ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్‌కు ఊహించని ఆశీర్వాదం దక్కింది. ఇప్పటి వరకు ఆయన ను చాలా మంది పెద్దలు ఆశీర్వదించినా.. తాజాగా.. ఆయనకు జీవితంలో మరిచిపోలేని.. ఊహకు కూడా అందని ఆశీర్వాదం లభించింది. దీంతో మంత్రి నారా లోకేష్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. సంతోషం వ్యక్తం చేశారు. తనకు మరింత బాధ్యత పెరిగిందని.. పెద్దలు తనపై ఎంతో ఆదరంతో ఉన్నారని.. మీడియా ముందు వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఎట్‌హోమ్(విందు) ఏర్పాటు చేశారు. దీనికి సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు.. సతీసమేతంగా హాజరయ్యారు. అదేవిధంగా మంత్రులు, ఇతర అధికారులు కూడా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలోనే మంత్రి నారా లోకేష్‌కు ఊహించని ఆశీర్వాదం.. అది కూడా రాష్ట్ర ప్రధమ పౌరురాలు.. నుంచి ఆశీర్వాదం లబించడం విశేషం.
గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్.. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పవన్ కల్యాణ్ సతీమణి అంద రూ కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్.. అటుగా వస్తూ.. వీరిని పలకరించారు. ఈ సమయంలో గవర్నర్ సతీమణికి ఆయన నమస్కారం చేయగా.. ఆమె.. లోకేస్ తలపై చేయి వేసి.. మరీ ఆశీర్వదించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఆశీర్వాదం మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఈ అరుదైన దృశ్యం తాలూకు ఫొటోలను టీడీపీ నాయకులు.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఇప్పటి వరకు సమీరా నజీర్ ఇలా ఎవరినీ ఆశీర్వదించకపోవడం గమనార్హం.