ఆ హీరోకు దండగ..ఈ హీరోకు పండగ

admin
Published by Admin — January 10, 2026 in Movies
News Image

తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళులకు కూడా సినిమా పరంగా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఈసారి పండుగ వినోదం వేరే లెవెల్లో ఉంటుందని ఆశించారు. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ తన చివరి చిత్రం జననాయగన్ పొంగల్‌కే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. కానీ అనూహ్యంగా సెన్సార్ సమస్యలతో ఆ సినిమా అనుకున్న ప్రకారం జనవరి 9న రిలీజ్ కాలేదు.

కోర్టుకు వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకుని ఎలాగైనా అనుకున్న డేట్‌కే సినిమాను రిలీజ్ చేద్దామని చూశారు కానీ.. కుదరలేదు. రిలీజ్ రోజే కోర్టు తీర్పు రావాల్సి ఉండడంతో సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త డేట్ గురించి ఆలోచిస్తున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో అయితే జననాయగన్ రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు సంక్రాంతికే షెడ్యూల్ అయిన శివకార్తికేయన్ మూవీ పరాశక్తి కూడా సెన్సార్ చిక్కుల్లో పడింది. గురువారం రాత్రి వరకు దానికి సర్టిఫికెట్ రాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం శనివారం ఈ చిత్రం రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.

ఐతే పరాశక్తి చిత్రానికి సెన్సార్ బోర్డు కొన్ని కట్స్‌తో క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో, శనివారం సినిమా రిలీజ్ అయింది. జననాయగన్ నుంచి పోటీ కూడా లేకపోవడంతో పరాశక్తి జాక్ పాట్ కొట్టినట్లే. విజయ్ సినిమా పోటీలో ఉండగా ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టమైంది. ఇప్పుడు పండుగ రేసులో ఉన్న పెద్ద సినిమా ఇదొక్కటే కావడంతో దీనికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఆ హీరోకు దండగ..ఈ హీరోకు పండగ అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Tags
parasakti movie hero sivakartikeyan pongal festival jananayagan
Recent Comments
Leave a Comment

Related News