అమెరికాలో తెలుగు యువతి నిఖిత దారుణ హత్యోదంతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిఖితను ఆమె స్నేహితుడు అర్జున్ శర్మ హత్య చేసి భారత్ కు పరారయ్యాడని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు హత్యకు గల కారణాలు ఏంటి అని అన్వేషిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అర్జున్ శర్మకు అప్పుగా ఇచ్చిన 1000 డాలర్లు తిరిగి అడిగిందన్న కారణంతోనే ఆమెను హత్య చేశాడని జరుగుతున్న ప్రచారం షాకింగ్ గా మారింది.
అర్జున్ శర్మకు 4,500 డాలర్లను నిఖిత అప్పుగా ఇచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందట. కొంతకాలం తర్వాత 3,500 డాలర్లను అర్జున్ శర్మి తిరిగి ఇచ్చేశాడు. ఇప్పటికే డబ్బులు తీసుకొని చాలాకాలం అయిందని, మిగిలిన 1000 డాలర్లు ఇవ్వాలని నిఖిత అడగడంతో వివాదం చెలరేగిందట. దీంతో, నిఖితను అర్జున్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఏమీ తెలియనట్లు హత్య చేసిన రోజే అర్జున్ శర్మ భారత్ కు వచ్చేశాడట. ప్రస్తుతం పరారీలో ఉన్న అర్జున్ శర్మ అరెస్టయితే ఈ కేసులో అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.