రూమ‌ర్స్‌కు చెక్‌.. ఒక్క‌ పిక్‌తో ఉపాస‌న ప్రెగ్నెన్సీపై వీడిన మిస్ట‌రీ..!

admin
Published by Admin — January 06, 2026 in Movies
News Image

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ఉండే క్రేజే వేరు. ఇటీవల ఉపాసన రెండోసారి గర్భం దాల్చారని, అది కూడా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని తెలిసినప్పటి నుండి మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఇదే సమయంలో కొందరు నెటిజన్లు ఉపాసన `సరోగసి`(అద్దె గర్భం) ద్వారా తల్లి కాబోతున్నారంటూ కొన్ని పుకార్లను పుట్టించారు.

గత కొద్దిరోజులుగా ఈ రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా, మెగా ఫ్యామిలీ ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా వంటలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్‌తో స్పష్టంగా కనిపించారు. దీంతో ఆమె సరోగసి ద్వారా కాకుండా, సహజంగానే గర్భం దాల్చారని అందరికీ అర్థమైపోయింది.

మెగా వారసురాలు క్లీంకార పుట్టిన మూడేళ్లకే, ఇప్పుడు కవల పిల్లలు రాబోతుండటంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. అటు చరణ్ కూడా తన కొత్త సినిమా 'పెద్ది' షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. మొత్తానికి ఎలాంటి ప్రెస్ నోట్లు, వివరణలు ఇవ్వకుండానే.. సింపుల్‌గా ఒకే ఒక్క ఫోటోతో తనపై వస్తున్న రూమర్లకు ఉపాసన చెక్ పెట్టేశారు.

Tags
Upasana Surrogacy Ram Charan Mega Family Upasana Pregnancy Chiranjeevi
Recent Comments
Leave a Comment

Related News

Latest News