ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన, పవన్ లో గెలుపు కూడా ఒక గెలుపేనా అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు . జనసేనకు పోలైన ఓట్ల శాతాన్ని బట్టి 21 సీట్లు ఎలా గెలుస్తారని రోజా ప్రశ్నించారు.
తన జీవితంలో జనసేన కార్యకర్తలు వంటి సిగ్గుమాలిన జెండా కూలీలను తాను ఎక్కడా చూడలేదని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ జెండా తప్ప మిగతా అన్ని పార్టీల జెండాలను జనసేన కార్యకర్తలు మోశారని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం అని ఆమె ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకోవడానికి తప్ప జనసేన కార్యకర్తలకు గానీ, ప్రజలకు గాని జనసేన వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శలు చేశారు.సొంతగా పోటీ చేసి ఆ పార్టీ గెలవలేదని ఎద్దేవా చేశారు.