టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ ఉంది. ఆ చిత్ర
థియేట్రికల్ ట్రైలర్‌ను తిరుపతిలో అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
రౌడీ అల్లుడు, జై చిరంజీవ, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలలో చిరంజీవి మార్క్ కామెడీ ఈ చిత్రంలో కనిపించడం పక్కా అనిపిస్తోంది. తనదైన శైలి కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్స్, డైలాగ్స్ తో వింటేజ్ మెగాస్టార్‌ను మళ్ళీ కనిపించారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక, చిరు, నయనతారల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇక, విక్టరీ వెంకటేశ్ క్యామియో ఎంట్రీ ట్రైలర్ కు హైలైట్ అని చెప్పవచ్చు.
గత సంక్రాంతి సందర్భంగా సంక్రాతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 2026 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చిరు కెరీర్ లో అత్యధిక థియేటర్లు, స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి, ఈ సంక్రాంతికి అనిల్, చిరులు సందడి ఏ రేంజ్ లో చేస్తారు అన్నది వేచి చూడాలి.
అయితే, చిరుకు రాజా సాబ్ చిత్రం నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత మాస్ క్యారక్టర్ లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక, దర్శకుడు మారుతి మార్క్ కామెడీతోపాటు ప్రేమకథా చిత్రమ్ సినిమా రేంజ్ లో హారర్ కామెడీ జానర్ లో వస్తున్న ఆ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు, మాస్ మహారాజ రవితేజ కూడా భక్తమహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరోవైపు, యంగ్ హీరో శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీంతో, ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న చిత్రాలలో దేనిని ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.