అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం చేసి.. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయనను ఓడిస్తానని ప్రతిజ్ఞ కూడా చేసిన వెనిజువెలా అధ్యక్షుడు.. నికోలస్ మదురో.. ఇప్పుడు అదే ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో చిక్కి ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నా రు. ట్రంప్‌ను ఆయన ఓడించలేదు కానీ.. వెనిజువెలా అధ్యక్షుడి అంతు చూస్తానంటూ.. తాను చేసిన ప్రతిజ్ఞను ట్రంప్ నిలబెట్టు కున్నారు. తాజాగా వెనిజువెలా అధ్యక్షుడిని ఆయన సతీమణితో సహా అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఈ పరిణామం.. యూరప్ దేశాలు సహా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఎందుకు?
ప్రధానంగా వెనిజువెలా-అమెరికాల మధ్య అనేక విషయాల్లో వివాదాలు ఉన్నాయి. అమెరికా తమను శాసిస్తోందన్నది వెనిజువె లా ఎప్పటి నుంచో చేస్తున్న ప్రధాన ఆరోపణ. అదేసమయంలో తమ చమురు నిక్షేపాలపైనా అమెరికా కన్ను వేసిందని కూడా వెనుజువెలా అధ్యక్షుడు మదురో ఆరోపిస్తున్నారు. ఇక, అమెరికా విషయానికివస్తే.. తమ దేశంలోని వలసలను ప్రోత్సహిస్తు న్నారని.. డ్రగ్స్‌ను పంపిణీ చేస్తున్నారని.. ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన గత ఆరు మాసాలుగా కూడా వెనిజు వెలా అధ్యక్షుడి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
అదేసమయంలో అమెరికాలో తనకు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన ఆందోళ నలు, నిరసనల వెనుక కూడా మదురో ఉన్నారన్నది ట్రంప్ చేస్తున్న ఆరోపణ. ఈ క్రమంలోనే తాజాగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన అమెరికా అధికారులు వెనుజువెలా అధ్యక్షుడు మదురో సహా.. ఆయన భార్య సీలీయా ఫ్లోరెస్‌ను కూడా అరెస్టు చేశారు. అనంతరం.. వారిని వెనుజువెలాలోనే ఒక రహస్య స్థావరంలో నిర్బంధించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ధారించారు. తమపైనా.. తమ ప్రజలపైనా కుట్రకు తెరదీసిన మదురోను తాము అధీనంలోకి తీసుకున్నామన్నారు.
2014 నుంచి
మదురో.. వెనుజువెలాకు.. 2014 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లాటిన్ అమెరికా-కరేబియన్ కూటమిని ఏర్పాటు చేసిన ఆయన.. వెనిజువెలాలో సామాన్య నేతగా ఆయన పేరు పొందారు. తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన కార్మిక యూనియన్ నాయకుడిగా కూడా ఎదిగారు. అనంతరం.. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత.. హ్యూగో చావెజ్ మరణానంతరం.. కీలక నేతగా ఎదిగారు. అయితే.. మదురో.. హయాంలో డ్రగ్స్‌కు కేంద్రంగా వెనుజువెలా మారిందన్న విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా వినిపించాయి.