ఏపీలోని కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీలో 2025 సంవత్సరం కొత్త జోష్‌ను తీసుకు వచ్చింది. మొత్తం 3 రూపాల్లో ఈ జోష్ కనిపిస్తోంది. తద్వారా.. పార్టీలో మునుపటి నైరాశ్యం పోయి.. ప్రస్తు తం ఉత్సాహంగానే నాయకులు కనిపిస్తున్నారు. దీనికితోడు భవిష్యత్తుపైనా ఆశలు పెరుగుతున్నాయి. బలమైన మోడీ మద్దతు చంద్రబాబుకు ఉండడంతోపాటు.. ఆయన గ్రాఫ్ కూడామరింతగా పుంజుకోవడం వంటివి.. టీడీపీకి ఈ ఏడాది కలిసి వచ్చిన పరిణామాలేనని చెప్పాలి.
1) నామినేటెడ్ పదవుల పంపకం: రాష్ట్రంలో టీడీపీకార్యకర్తలు, నాయకులను ఉత్సాహ పరిచేలా ఏ ఏడా ది పార్టీ అధినేత చంద్రబాబు.. నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. విస్తృత స్థాయిలో ఇచ్చిన ఈ పదవులు అందరినీ సంతృప్తి పరిచాయి. అదేసమయంలో కొందరు వెనుకబడి పోయారని భావిస్తున్న నాయకులను కూడా ఏరి పట్టుకుని మరీ వారికి న్యాయం చేశారు. అదేవిధంగా సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్లు కూడా ఈ ఏడాదే ఏర్పాటు చేయడం ద్వారా.. వారికి కూడా న్యాయం జరిగింది.
2) అధినేత చేరువ: గతానికి భిన్నంగా ఈ సారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబా బు చాలా దగ్గరగా చేరువ అయ్యారు. తొలి ఆరు మాసాలు ఎలా ఉన్నా.. తర్వాత.. ఆరు మాసాల్లో పార్టీ నాయకుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పాటించిన చంద్రబాబు ప్రతి శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం సమయం కేటాయించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి తరచుగా వెళ్లారు. కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. తద్వారా.. అధినేత చేరువ కావడంతో కార్యకర్తలు, నాయకులు హ్యాపీగా ఫీలయ్యారు.
3) టీడీపీ భవితవ్యం: పార్టీ అధినేతగా చంద్రబాబు.. తర్వాత.. పార్టీకి ఎవరు? అనే ప్రశ్నకు దాదాపు అప్రక టిత సమాధానం ఈ ఏడాది నాయకులకు స్పష్టమైంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తున్నారని.. ప్రచారం ఉన్నా.. ఇప్పుడు అది వీగిపోయింది. బలమైన నాయకుడిగా.. నారా లోకేష్ ఎదిగారు. అంతేకా దు.. నాయకులకు, కార్యకర్తలకు కూడా ఆయన చేరువ అయ్యారు. తరచుగా పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. దీంతో భావినాయకత్వంపై పార్టీ నాయకులకు క్లారిటీ రావడంతోపాటు భరోసా కూడా ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఈ మూడు అంశాలు.. టీడీపీకి 2025లో కలిసి వచ్చాయనే చెప్పాలి.