పార్టీలు కూటమి కట్టడం.. ఈ దేశంలో కొత్తకాదు. అయితే.. కూటమి కట్టిన పార్టీలు.. ఎంత కాలం పదిలంగా ఉంటాయి? ఎన్నాళ్లు సఖ్యతతో ముందుకు సాగుతాయి? అనే విషయాలు అత్యంత ప్రధానం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు ఏదో ఒక కీచులాట వస్తూనే ఉంది. దీంతో మొహమొహాలు చూసుకునే పరిస్థితి లేని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ, దీనికి భిన్నంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పదికాలాల పాటు కలిసి ఉండేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
కలిసి వస్తున్నవి ఇవే..
1) పైస్థాయిలో సఖ్యత: కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ, బీజేపీలో క్షేత్రస్థాయి నాయకత్వం ఎలా ఉన్న ప్పటికీ.. పైస్థాయిలో అగ్ర నేతలుమాత్రంకలివిడిగానే ముందుకు సాగుతున్నారు. బీజేపీలో అగ్రనాయకు లు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర నేతల వరకు.. అనేక మంది కూటమి విషయంలో పాజిటివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు.. కూటమిని ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదన్నట్టుగానే సంకేతాలు పంపిం చారు. ఆర్థికంగా సర్కారుకు సహకరిస్తున్నారు. ఇక, జనసేన-టీడీపీ మధ్య కూడా పైస్థాయి బాండింగ్ బాగుంది. ఇది కలిసి వస్తున్న ప్రధాన అంశం.
2) కామన్ ప్రత్యర్థిని గుర్తించడం: కూటమి పార్టీలకు కామన్ ప్రత్యర్థి వైసీపీనే. దీనిని గుర్తించడంతో ఇప్పుడు మూడు పార్టీలు కూడా వైసీపీ విషయంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ విషయంలో బీజేపీ ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం వైసీపీ విషయంలో క్లారిటీతోనే ఉంది. దీంతో కామన్ ప్రత్యర్థిని నిలువరించేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ కూటమి పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అందుకే.. పీపీపీ విధానంపై వైసీపీ నిరసన వ్యక్తం చేసినప్పుడు మూడు పార్టీ ల నేతలు.. స్పందించారు.
3) పరస్పర సహకారం: కూటమిలోని మూడు పార్టీల నాయకుల మధ్య పరస్పర సహకారం.. గౌరవం కూడా మెండుగా ఉంటున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పనితీరును చంద్రబాబు, సీఎం విజన్‌ను పవన్ కల్యాణ్ తరచుగా ప్రశంసిస్తున్నారు. ఇదిబలమైన సంకేతాలను పంపిస్తోంది. అదేవిధంగా ఇరువురు నా యకులు కూడా.. బీజేపీ అగ్రనేతలను కొనియాడుతున్నారు. మోడీని ప్రధానంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదేసమయంలో పవన్ కల్యాణ్ సూచనలను ప్రభుత్వం తూచ తప్పకుండా పాటిస్తోంది. ఇలా.. పరస్పర సహకారంతో కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడం 2025లో స్పష్టంగా కనిపిస్తోంది.