ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు జరిగితే.. మరోసారి కూటమి అధికారంలోకి రావడం పక్కా!. ఈ విషయా న్ని టీడీపీ నాయకులు, బీజేపీ నేతలు చెప్పడం లేదు. వైసీపీ నాయకులే అంటున్నారు. పైకి ఎవరూ బ యట పడకపోయినా.. అంతర్గత సమాచారం.. అంతర్గతంగా జరుగుతున్న చర్చలను గమనిస్తే.. ఖచ్చి తంగా కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. దీనికి ప్రధానంగా 4 రీజన్లు కూడా చెబుతున్నారు. ఒక్క వైసీపీ నాయకులే కాదు.. తటస్థులు కూడా ఇదే చెబుతుండడం గమనార్హం.
టీ షాపుల దగ్గర, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర కూడా ఇదే తరహా చర్చ సాగుతోంది. ఏ నలుగురు కలిసినా కూటమిదే విజయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కూడా కూటమి వస్తుందన్న చర్చ చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న రీజన్లు.. నాలుగు ఉన్నాయి. 1) సంక్షేమంతో కూడిన అభివృ ద్ధి: గతంలో వైసీపీ సంక్షేమాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. కానీ, ఇప్పుడు కూటమి సంక్షేమంతో పాటు.. అభివృద్ధిని కూడా చూపిస్తోంది. పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఇది మెజారిటీ విజయాన్ని అందిస్తుందని చెబుతున్నారు.
2) కూటమి బలం: ప్రస్తుతం కూటమి చాలా బలంగా ఉంది. పైస్థాయిలో నాయకుల మధ్యకలివిడి స్పష్టం గా కనిపిస్తోంది. ఇది కూడా పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. 3) పవన్ ఇమేజ్: పవన్ కల్యాణ్ ఇమేజ్ గత ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. బలమైన వాయిస్‌తోపాటు ఇప్పుడు సనాతన ధర్మాన్ని కూడా భుజాన వేసుకున్నారు. ఇది ఆయనకు లాభిస్తుందన్నది మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆటోమేటిక్‌గా కూటమికి మేలు చేస్తుందని అంటున్నారు.
4) చంద్రబాబు పాలన: చంద్రబాబు పాలనకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయి. సంక్షేమం విషయంలోనూ ఆయనకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. పైగా అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల పూర్తికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి మరోసారి విజయం దక్కించుకుంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. గతంలో వచ్చినన్ని సీట్లు వస్తాయా? అనేది మాత్రం సందేహంగా ఉందని అంటున్నారు. అయినా.. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి అప్పటికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి.