టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం

admin
Published by Admin — November 30, 2025 in Andhra
News Image
ప్రతి నెలా ఒకటో తేదీన సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం తు.చ తప్పకుండా లబ్ధిదారులతో మమేకమై పెన్షన్లు పంచుతున్నారు. అయితే, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనం లేదు. దీంతోపాటు, సీఎంఆర్ఎష్ చెక్కుల పంపిణీలో సైతం కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు. ఈ క్రమంలోనే 'పేదల సేవలో' కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణిస్తారని చంద్రబాబు హితవు పలికారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని నేతలకు ఆయన సూచించారు. పెన్షన్ల పంపిణీని నేతలందరూ పేదల సేవగా భావించాలని అన్నారు. కాగా, పెన్షన్లు, చెక్కులు పంపిణీ చేయని 55 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తీరు మారకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయినా సరే కొందరు నేతల తీరు మారాల్సి ఉంది.
Tags
cm chandrababu tips order tdp mlas pension distribution
Recent Comments
Leave a Comment

Related News