ఈ మాట వైసీపీ నాయకులు.. అదే విధంగా వైసిపి పార్టీ తరఫున సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నాయకులు చెబుతున్న బహిరంగ వ్యాఖ్య. జగన్ కు జాకీలు వేయలేమంటూ ఇటీవల యూట్యూబ్లో ఆ పార్టీని సమర్థించే నాయకుడు చేసిన మాట ఇది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఒకవైపు 16 నెలలు గడిచిపోయినప్పటికీ వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు కానీ వైసీపీ తరఫున బలంగా పోరాడేవారు కానీ ఇప్పటివరకు కనిపించటం లేదు.
ఒకవేళ బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇతరత్రా కుటుంబ సమస్యలు కావచ్చు ఈ కారణంతో ఆయన ఎలివేట్ కాలేకపోతున్నారు. దీంతో వైసిపి తరఫున ప్రజల్లోకి జగన్ విషయాలను తీసుకువెళ్లడం గాని పార్టీ తరఫున కార్యక్రమాల విషయాల్ని వివరించడం కానీ నాయకులు చేపట్ట లేకపోతున్నారన్నది వాస్తవం. దీనికి తోడు గత ఎన్నికల్లో జగన్ చేసుకున్న స్వయంకృతం వల్ల కొంతమంది నాయకులకు టికెట్లు దక్కలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు.
ఫలితంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు పార్టీ నుంచి పెద్దగా కనిపించడం లేదు. కానీ, ఇదే సమయంలో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు అంటూ కొన్ని విషయాలను ప్రజలకు వివరించడంలో సోషల్ మీడియా బలంగా పనిచేస్తుంది. అయితే ఇంత చేస్తున్న కూడా జగన్ గ్రాఫ్ పెద్దగా పెరగటం లేదన్నది యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్న వారు చేస్తున్న విమర్శలు.
ఎందుకంటే జగన్ ఎక్కడైనా మాట్లాడాల్సివస్తే నాలుగు మాటలు మాట్లాడితే కచ్చితంగా ఒకటో రెండో తప్పులు దొర్లడం లేనిపోని వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా చూసి కూడా స్క్రిప్ట్ ను చదవలేని పరిస్థితి ఏర్పడడం వంటివి తీవ్రంగా అవహేళనకు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక తాము ఎంత ప్రయత్నం చేసినా వైసిపి తరఫున బలంగా మాట్లాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని సోషల్ మీడియాలో స్వతంత్రంగా పనిచేస్తూ వైసిపికి సానుభూతిపరంగా వ్యవహరిస్తున్న వారు చెబుతున్న మాట.
జగన్ తరఫున ఎంత తాము హైప్ చేసినా ఆయన గ్రాఫ్ అయితే పెరగడం లేదని వీరు చెబుతున్నారు. నిజానికి గత 16 నెలలుగా సోషల్ మీడియాలో కానీ ఇటు యూట్యూబ్లో కానీ వైసీపీ తరఫున చాలా మంది మాజీ జర్నలిస్టులు గతంలో సాక్షిలో పనిచేసి మానేసిన వారు అలాగే జగన్ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వారు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వాటిలో ఉన్న తప్పులను కూడా ఒకరకంగా ఎండగడుతున్నారు.
అనంతరం దీనికి అనుసంధానంగా పార్టీ తరఫున పుంజుకుని మాట్లాడాల్సినటువంటి నాయకులు మౌనంగా ఉండడంతో పాటు వీరికి పెద్దగా గుర్తింపు లేకపోవడం వంటివి సమస్యగా మారుతున్నాయి. దీంతో వీరంతా ఇక తాము జాకీలు వేయలేమని చెప్పడం విశేషం. ఎంత చేసినా జగన్‌కు గ్రాఫ్ పెరగడం లేదని అనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మరి దీనిపై వైసీపీ ఏదైనా చర్చ చేస్తుందా లేదా అనేది చూడాలి.