జగన్ పరదాల్లో...చంద్రబాబు ఆటోలో

admin
Published by Admin — October 04, 2025 in Politics, Andhra
News Image

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 కిలో మీట‌ర్ల దూరాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రి నారా లోకేష్‌, బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్‌లు క‌ల‌సి ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆటో డ్రైవ‌ర్ల కుటుంబాల‌తో మ‌మేక‌మ‌య్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును తెలుసుకున్నారు. వారికి అందుతున్న ప‌థ‌కాల వివ‌రాల‌ను కూడా న‌మోదు చేసుకున్నారు.

తొలుత మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, విజ‌య‌వాడ నుంచి బీజేపీ చీఫ్ మాధ‌వ్‌లు తాడేప‌ల్లిలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న సీఎం చంద్ర‌బాబు నివాసానికి వ‌చ్చారు. అనంత‌రం.. అక్క డ ఏర్పాటు చేసి ఉంచిన నాలుగు ఆటోల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేస్‌, మాధ‌వ్‌లు ఆటోలో ఎక్కారు. అక్క‌డ నుంచి బ‌య‌లు దేరిన ఆటోలు.. విజ‌య‌వాడ సింగ్‌న‌గ‌ర్‌లో ఉన్న మాకినేని బ‌స‌వపున్న య్య స్టేడియంకు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో వారు ఆటో డ్రైవ‌ర్ల కుటుంబాల స‌మ‌స్య‌లు తెలుసుకున్నా రు.

ఈ స‌మ‌యంలో న‌లుగురు నాయ‌కులు కూడా.. ఆటో డ్రైవ‌ర్లు ధ‌రించే ఖాకీ చొక్కాల‌నే వేసుకున్నారు. అదేవిధంగా ఆటో స‌మ‌స్య‌లు, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు, సీఎన్‌జీ గ్యాస్ ధ‌ర‌ల‌ను తెలుసుకున్నారు. జీఎస్టీ త‌గ్గింపు ద్వారా ఒన‌గూరుతున్న ల‌బ్ధిని కూడా అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. సీఎం చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగానికి ముందు.,. స‌భ వేదిక‌పైకి.. తాను క‌లిసి ప్ర‌యాణించి వ‌చ్చిన ఓ డ్రైవ‌ర్ కుటుంబాన్ని పిలిచారు. వారి స‌మ‌స్య‌లను స‌భా వేదిక‌పైనే ఆయ‌న వివ‌రించారు. 

2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని చంద్రబాబు అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ పరదాలు కట్టుకుని జనం మధ్యకు వచ్చేవారని, ఈ రోజు తాము ఆటోల్లో ప్రజల మధ్య స్వేచ్ఛగా ప్రయాణిస్తూ సభా వేదికకు చేరుకున్నామని అన్నారు.

అదేవిధంగా ఆటో డ్రైవ‌ర్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ.. గ‌త ప్ర‌భుత్వం ఎలా వేధించిందో వివ‌రిస్తూ.. సీఎం చంద్ర బాబు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ప‌ది వేల రూపాయ‌ల‌ను ఆటో డ్రైవ‌ర్ల‌కు ఇచ్చిన గ‌త ప్ర‌భుత్వం ర‌హ‌దారుల‌పై గుంత‌లు కూడా పూడ్చ‌కుడా.. 20 వేల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యేలా చేసింద‌ని విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే ర‌హ‌దారులు నిర్మించామ‌న్నారు. అదేవిధంగా వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున చ‌లాన్లు రాశార‌ని.. తాము వ‌చ్చాక వాటిని స‌రళీక‌రించామ‌న్నారు. ఆటో వాలా జిందాబాద్ అంటూ.. ఆయ‌న ప్ర‌సంగంలో ప‌లు మార్లు వ్యాఖ్యానించారు.

Tags
Cm chandrababu jagan's regime autowala auto driver la sevalo scheme
Recent Comments
Leave a Comment

Related News

Related News

ఏపీలో నమో అంటే నాయుడు మోదీ: లోకేష్ నమో...భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు షార్ట్ కట్. ఆయన అభిమానులు ముద్దుగా మోదీని నమో అని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాలలో కూడా నమో బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మోదీ సమకాలీకుడైన ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గ్లోబల్ ఇమేజ్ ఉంది. జాతీయ మీడియాలో చంద్రబాబును నాయుడు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇకపై ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోదీ అని మంత్రి లోకేష్ కొత్త భాష్యం చెప్పారు. ఈ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు పరుగులు పెడుతోందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన చరిత్ర ఉందని చెప్పారు. ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. దేశవిదేశాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టిస్తున్నామని తెలిపారు. యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని, కేవలం 17నెలల్లో $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారును చూసి ఏపీలో పెట్టబడులు పెడుతున్నారని చెప్పారు.

Show All
Latest News