అమెరికాలోని న్యూజెర్సీలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం జరిగింది. వేద పండితుల ఆశ్వీరచనాల నడుమ అమెరికాలోని పలు తెలుగు సంఘాల సభ్యులు, ఎన్నారైలు రవి మందలపును సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ భీమినేని, శ్రీనాథ్ రావు తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మందలపునకు 'నమస్తే ఆంధ్ర' హార్థిక శుభాకాంక్షలు తెలిజయేసింది.
ఈ సందర్భంగా రవి మందలపు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి టీడీపీతో తనకు అనుబంధం ఉందని ఆయన అన్నారు. 1983లో 11 ఏళ్ల వయసులో టీడీపీ జెండా పట్టుకున్నానని, తన మేనమామ కోనేరు నాగేశ్వర రావు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. 1985లో గుడివాడలో అన్న నందమూరి తారకరామారావు పోటీ చేశారని, అది తమ నియోజకవర్గమని చెప్పారు. టీడీపీ మీద అంత అభిమానం ఎందుకని లోకేశ్ తనను అడిగారని, చిన్న వయస్సు నుంచి టీడీపీ జెండా మోసినవాడినని, పార్టీ అంటే తనకు ఎనలేని అభిమానమని చెప్పానని తెలిపారు.
తాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుచరుడినని, లోకేశ్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నానని లోకేశ్ కు చెప్పానని అన్నారు. తెలుగువారి గుండె మీద చేసిన సంతకం టీడీపీ అని, ఆనాడు తెలుగువారికి అన్నగారు ఆత్మగౌరవం ఇచ్చారని, ఈనాడు చంద్రబాబు తెలుగువారికి ఆత్మవిశ్వాసం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు తనవంతు సహాయసహకారాలందించేదుకు తాను అమెరికాలో వ్యాపారాలు వదిలేసి ఏపీకి వెళ్లానని, రాష్ట్రాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు.
'రవి మందలపు' పూర్తి ప్రసంగం