`హనుమాన్` వంటి పాన్ ఇండియా హిట్ అనంతరం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నుంచి వచ్చిన తాజా చిత్రం `మిరాయ్`. ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్ కు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ కాగా.. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన మిరాయ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, విజువల్స్ కు మంచి స్పందన రావడంతో మిరాయ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. కలెక్షన్స్ పరంగా హనుమాన్ ను మిరాయ్ సులభంగా అధిగమించింది. ఇదిలా ఉంటే.. మిరాయ్ స్టార్స్ రెమ్యునరేషన్స్ లెక్కలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
హీరో తేజ హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపదించుకున్నాడు. అయినప్పటికీ మిరాయ్ కు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ జెస్ట్ రూ. 2 కోట్లు అట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తేజకు మరీ అంత తక్కువా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ప్రమోషన్స్ లో తేజ మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ పై తనకు ఆసక్తి లేదు. మంచి సినిమాల్లో భాగం కావడమే తనకు ముఖ్యం. హనుమాన్ కు తీసుకున్నంతే ఈ చిత్రానికీ తీసుకున్నానని పేర్కొన్నారు. ఇకపోతే విలన్ గా యాక్ట్ చేసిన మంచు మనోజ్ రూ. 3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నాడట. శ్రియాకు రూ.2 కోట్లు, హీరోయిన్ రితిక నాయర్ కు రూ.50 లక్షలు ఇచ్చారని తెలుస్తోంది.