ఏపీలో పొలికికల్ లోకల్ వార్ కు ఎన్నికల సంఘం రెడీ అయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ కంటే 3 నెలలు ముందుగానే నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ ప్రకారం పురపాలక, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు మొదలుబెట్టాలని సూచించారు.
వాస్తవానికి 2026 ఏప్రిల్ లో సర్పంచ్ ల పదవీ కాలం, 2026 మార్చిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. అయితే, చట్టంలోని వెసులుబాట్ల ప్రకారం జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. అయితే, ఈ ఎన్నికలు వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశముంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే. గతంలో జరిగిన పొలిటికల్ లోకల్ వార్ లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కనీసం నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వకుండా వైసీపీ భయభ్రాంతులకు గురి చేసింది. కానీ, ఈ సారి ఆ అవసరం లేకుండా సీఎం చంద్రబాబు తన పాలనా దక్షతతోనే ఈ లోకల్ వార్ ను వన్ సైడ్ చేశారని, కూటమి పార్టీల గెలుపు ఖాయమని ఆ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్:
అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ
నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం
నవంబరు 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల ఏర్పాట్లు
డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు
2026 జనవరిలో నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన