పిఠాపురం టూర్..వర్మపై పవన్ స్పెషల్ ఫోకస్

News Image

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకువెళ్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ సమిష్టి కృషితో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అదే విధంగా రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లను పవన్ పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పునాదిరాయి వేశారు. ఏమైనా సమస్యలు ఉటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పవన్ చెప్పారు. ఇక, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

పవన్ పర్యటన సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆయన వెంట ఉన్నారు. ఆసుపత్రి శంకు స్థాపన శిలా ఫలకం ఆవిష్కరణ జరుగుతున్న సమయంలో ప్రత్యేకించి వర్మ ఫొటోలో పడేలా పవన్ ఆయనను ముందుకు రావాలని కోరారు. ఆ తర్వాత వర్మకు పవన్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఇటీవల జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నేతల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్, వర్మ కలిసి కనిపించడంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News