టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. `గీతా గోవిందం` సినిమాతో ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారింది. ఇంతవరకు నేరుగా తాము ప్రేమలో ఉన్న విషయాన్ని ఈ జంట అంగీకరించకపోయినా.. పరోక్షంగా పలుమార్లు తమ బంధాన్ని ధ్రువీకరించారు. కలిసి వెకేషన్స్ కు వెళ్లడం, ఏ ఫెస్టివల్ వచ్చిన విజయ్ ఇంట్లో రష్మిక వాలిపోవడం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు దర్శనమిచ్చాయి. వధూవరుల దుస్తుల్లో విజయ్ రష్మిక మెరిసిపోయారు. మెడలో దండలు, రష్మిక నుదుట సింధూరం పెళ్లి వాతావరణాన్ని తలపించాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు మరియు నెటిజన్లు షాక్ అయిపోయారు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నార్రా అంటూ అయోమయంలో పడ్డారు.
కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ సహాయంతో జనరేట్ చేసినవి. కానీ నిజమైన ఫోటోలు మాదిరే ఉండడంతో.. విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నారని చాలా మంది పొరబడ్డారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. విజయ్ త్వరలోనే `కింగ్‌డమ్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ డ్రామా జూలై 31న విడుదల కాబోతుంది. మరోవైపు రష్మిక రీసెంట్ గా `కుబేర`తో బిగ్ హిట్ కొట్టింది. ప్రస్తుతం `మైసా`, `ది గర్ల్‌ఫ్రెండ్` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.