ఎస్సీల‌కు ఫ‌లాలు.. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు బాబు కేబినెట్ ఓకే!

News Image

ఏపీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. తాజాగా జ‌రిగిన ఏపీ మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించి ఆమోదం తెలిపింది. దీనిపై త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అనంత‌రం.. అమ‌లులోకి తీసుకురానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎస్సీవ‌ర్గీక‌ర‌ణ‌కు న‌డుం బిగించాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ కూడా మాజీ ఐఏఎస్ అదికారి రాజీవ్ రంజ‌న్ మిశ్రా నేతృత్వంలో ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేసి.. రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింది. దీనిపై అనేక సందేహాలు.. ప్ర‌శ్న‌లు.. సూచ‌న‌లు వ‌చ్చాయి.

ఎట్ట‌కేల‌కు గ‌త నెల‌లోనే ఏక స‌భ్య క‌మిష‌న్ త‌న‌నివేదిక‌ను రాష్ట్ర స‌ర్కారుకు అందించింది. అనంత‌రం దీనిని అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి ఆమోదించారు. త‌ర్వాత‌.. గ‌వ‌ర్న‌ర్‌కు కూడా పంపించారు. అయితే.. నిబంధ‌న‌ల మేర‌కు జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు దీనిని పంపించారు. అక్క‌డ నుంచి కూడా కొన్ని సూచ‌న‌లు రావ‌డంతో.. వాటిని కూడా జోడించి.. పూర్తిస్థాయి లో నివేదిక‌ను రూపొం దించారు. తాజాగా ఇటీవ‌ల నివేదిక‌ను పూర్తి చేయ‌డంతో.. బుధ‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చిం చారు. ప్ర‌స్తుతం రాష్ట్రాన్నియూనిట్‌గా తీసుకుని ఈ నివేదిక‌లోని అంశాల‌ను అమ‌లు చేయ‌నున్నారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ నివేదిక‌ ద్వారా ఎస్సీల‌లో రెల్లి, మాదిగల్లోని ఉప కులాల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. ఇక‌, కేబినెట్ ఆమోదం పొందిన నేప‌థ్యంలో దీనిపై మూడు రోజుల్లో జీవో విడుద‌ల చేయ‌నున్నారు. దాని ప్ర‌కారం.. అమ‌లు కానుంది. ఇక‌, నుంచి ఎస్సీ సామాజి క వ‌ర్గాల‌కు అందే.. రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు.. ఈ నివేదిక ప్ర‌కారం అంద‌నున్నాయి. దీనిలో త‌క్కువ సంఖ్య‌లో ఉన్న రెల్లి కుల‌స్తుల‌కు 1 శాతం రిజ‌ర్వేష‌న్ తొలిసారి అంద‌నుంది. అదేవిధంగా ఎస్సీల్లో ఉప కులాల‌కు 6.1 శాతం రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయి. మాల సామాజిక వ‌ర్గానికి 7 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌నున్నారు. మొత్తానికి కీల‌క‌మైన ఈ వ్య‌వ‌హారం.. త్వ‌ర‌లోనే అమల్లోకి రానుంది.

Recent Comments
Leave a Comment

Related News